Big Story: జార్జి ఫ్లాయిడ్ హత్య.. రేసిజానికి వ్యతిరేకంగా బ్రిటన్ లో రేగిన నిరసన జ్వాలలు

| Edited By: Pardhasaradhi Peri

Jun 08, 2020 | 2:29 PM

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు, రేసిజానికి , పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా బ్రిటన్ లో దేశవ్యాప్తంగా ఆందోళనకారులు రెచ్చిపోయారు. అనేక చోట్ల..

Big Story: జార్జి ఫ్లాయిడ్ హత్య.. రేసిజానికి వ్యతిరేకంగా బ్రిటన్ లో రేగిన నిరసన జ్వాలలు
Follow us on

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు, రేసిజానికి , పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా బ్రిటన్ లో దేశవ్యాప్తంగా ఆందోళనకారులు రెచ్చిపోయారు. అనేక చోట్ల పోలీసులతో ఘర్షణలకు తలపడ్డారు. వారిపైకి కాలుతున్న టపాకాయలు విసరివేశారు. ఈ ఘర్షణల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. అయితే బ్రిస్టల్ లో సుమారు 10 వేల మంది నిరసనకారులు 17 వ శతాబ్దం నాటి ‘స్లేవ్ ట్రేడర్ (బానిసలుగా పేదలను అమ్మిన) ఎడ్వర్డ్ కోస్టన్ శిలా విగ్రహాన్ని ధ్వంసం చేసి దాన్ని ఈడ్చుకుంటూ ఓ కాలువలోకి తోసివేయడం విశేషం. ఈ విగ్రహాన్ని కొన్ని వందలమంది ఆందోళనకారులు తాళ్లతో కట్టి కిందపడవేసి దానికి రెడ్ పెయింట్ పూసి వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్లారు. కొంతమంది దాన్ని కాళ్లతో తొక్కగా.. ఓ నిరసనకారుడు.. జార్జ్ ఫ్లాయిడ్ ని మినియాపొలీస్.. పోలీసోడు అతని గొంతుపై మోకాలితో నొక్కినట్టుగానే నొక్కి తన కసి తీర్చుకున్నాడు.. ఈ నిరసనకారులంతా ఆ విగ్రహాన్ని లాక్కుపోయి పెద్ద కాలువలోకి తోసివేశారు. ఇక పార్లమెంట్ స్క్వేర్ లోని విన్ స్టన్ చర్చిల్ విగ్రహానికి కొందరు నల్లరంగు పూశారు.

ఎడ్వర్డ్ కోస్టన్ శిలా విగ్రహం వెనుక ఓ కథనమే ఉంది. 17 వ శతాబ్దంలో స్లేవ్ ట్రేడర్ అయిన ఇతగాడు నాటి రాయల్ ఆఫ్రికన్ కంపెనీలో సభ్యుడు. ఆ నాడు సుమారు 80 వేలమంది మహిళలు, పిల్లలను ఎడ్వర్డ్ ఆఫ్రికా నుంచి అమెరికాకు ‘రవాణా’ చేశాడట .. 1721 లో తను మరణించేముందు తన ఆస్తినంతా ఛారిటీలకు విరాళంగా ఇచ్చినట్టు చెబుతారు.  . దీంతో  బ్రిస్టల్ లో ఇప్పటికీ ఇతని పేరిట స్మృతి చిహ్నాలు ఉన్నాయి. అయితే ఇతని విగ్రహాన్ని తొలగించాలంటూ గతంలో ప్రభుత్వానికి కొందరు పిటిషన్ పెట్టుకోగా దానికి మద్దతుగా సుమారు 11 వేల మంది సంతకాలు చేశారు.

ఇలా ఉండగా ఇతని విగ్రహాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేయడాన్ని బ్రిటన్ హోమ్ మంత్రి ప్రీతి పటేల్ ఖండిస్తూ.. వారి ప్రవర్తన దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. వైట్ హాల్ ప్రాంతంలో కూడా నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో అనేకమంది గాయపడ్డారు.

Video Courtesy : MailOnline