కాషాయ రెపరెపలు , బీజేపీ కార్యాలయాల వద్ద కార్యకర్తల జోష్

దేశంలో బీజేపీ కార్యాలయాల వద్ద పార్టీ కార్యకర్తల సంబరాలు మిన్నంటుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో బాటు ఉప ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో నూ బీజేపీ తన హవా చాటుతుండడతో వారి జోష్ కి అంతులేకుండా పోతోంది. సాయంత్రం అయిదు గంటలవరకు అందిన లీడ్ ట్రెండ్స్ ట్ ప్రకారం బీహార్ లో 129 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ అప్పుడే రెండు సీట్లలో  విజయం సాధించింది. అటు ఆర్జేడీ 105 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఈ పార్టీ కూడా […]

కాషాయ రెపరెపలు , బీజేపీ కార్యాలయాల వద్ద కార్యకర్తల జోష్

Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 10, 2020 | 5:53 PM

దేశంలో బీజేపీ కార్యాలయాల వద్ద పార్టీ కార్యకర్తల సంబరాలు మిన్నంటుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో బాటు ఉప ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో నూ బీజేపీ తన హవా చాటుతుండడతో వారి జోష్ కి అంతులేకుండా పోతోంది. సాయంత్రం అయిదు గంటలవరకు అందిన లీడ్ ట్రెండ్స్ ట్ ప్రకారం బీహార్ లో 129 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ అప్పుడే రెండు సీట్లలో  విజయం సాధించింది. అటు ఆర్జేడీ 105 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఈ పార్టీ కూడా రెండు చోట్ల గెలిచింది.

గుజరాత్  ఉపఎన్నికల్లో 8 స్థానాలకు గాను మూడు చోట్ల బీజేపీ విజయం సాధించి మిగతా 5 సీట్లలోనూ లీడ్ లో ఉంది. యూపీలో మూడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. బీహార్ లో సాయంత్రం 5 గంటలవరకు 55 శాతం లీడ్ ట్రెండ్స్ తెలిశాయి.