బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు

|

May 05, 2019 | 11:04 AM

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి బీభత్సం సృష్టించారు. అనంతనాగ్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గుల్ మహ్మద్ మీర్‌ను కాల్చి చంపేశారు. శనివారం రాత్రి 10గంటలకు ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో మిర్ ఛాతీ, ఉదర భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా.. మధ్య దారిలోనే తుది శ్వాస విడిచారని స్థానిక పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు మిలిటెంట్ల కోసం గాలింపు […]

బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు
Follow us on
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి బీభత్సం సృష్టించారు. అనంతనాగ్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గుల్ మహ్మద్ మీర్‌ను కాల్చి చంపేశారు. శనివారం రాత్రి 10గంటలకు ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో మిర్ ఛాతీ, ఉదర భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా.. మధ్య దారిలోనే తుది శ్వాస విడిచారని స్థానిక పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు మిలిటెంట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా 60 ఏళ్ల మిర్ హత్యను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మిర్ కుటంబానికి అండగా ఉంటామని ప్రధాని భరోసా ఇచ్చారు. జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ బలోపేతానికి మహ్మద్ చేసిన కృషి మరువలేనిదని ప్రధాని అన్నారు. దేశంలో ఉగ్రవాదానికి తావులేదని.. ఇలాంటి చర్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.