బీజేపీ లోక్‌సభాపక్ష నేతగా మోదీ

లోక్ సభ తొలి సమావేశాలు ఈ నెల 17 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను బీజేపీ పార్లమెంటరీ పార్టీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభలో పార్టీ నేతగా వ్యవహరిస్తారు.లోక్‌సభాపక్ష ఉపనేతగా రాజ్‌నాధ్ సింగ్, రాజ్యసభాపక్ష నేతగా థాపర్ చంద్ గెహ్లట్, రాజ్యసభాపక్ష ఉపనేతగా పీయూష్ గోయల్ నియమితులయ్యారు. మరోవైపు లోక్‌సభలో అధికార పార్టీ చీఫ్ విప్‌గా ప్రహ్లాద్ జోషిని.. ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా అర్జున్ రామ్ మేఘ్వాల్‌పేర్లను బీజేపీ పార్లమెంటరీ కార్యాలయం […]

బీజేపీ లోక్‌సభాపక్ష నేతగా మోదీ

Edited By:

Updated on: Jun 12, 2019 | 6:53 PM

లోక్ సభ తొలి సమావేశాలు ఈ నెల 17 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను బీజేపీ పార్లమెంటరీ పార్టీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభలో పార్టీ నేతగా వ్యవహరిస్తారు.లోక్‌సభాపక్ష ఉపనేతగా రాజ్‌నాధ్ సింగ్, రాజ్యసభాపక్ష నేతగా థాపర్ చంద్ గెహ్లట్, రాజ్యసభాపక్ష ఉపనేతగా పీయూష్ గోయల్ నియమితులయ్యారు.

మరోవైపు లోక్‌సభలో అధికార పార్టీ చీఫ్ విప్‌గా ప్రహ్లాద్ జోషిని.. ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా అర్జున్ రామ్ మేఘ్వాల్‌పేర్లను బీజేపీ పార్లమెంటరీ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. అటు రాజ్యసభలో ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా వీ.మురళీధరన్, లోక్‌సభలో బీజేపీ చీఫ్ విప్‌గా డాక్టర్ సంజయ్ జైశ్వాల్, రాజ్యసభలో చీఫ్‌ విప్‌గా నారాయణ్ లాల్ పంచారియా వ్యవహరిస్తారు.