BJP candidates first list tomorrow: గ్రేటర్ ఎన్నికల నగరా మోగడంతో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్న కమలనాథులు రేపు (నవంబర్ 18 బుధవారం) తమ పార్టీ తరపున గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనేజ్‌మెంటు కమిటీ కన్వీనర్ డా.లక్ష్మణ్ స్వయంగా పార్టీ సన్నాహాలను మీడియాకు వెల్లడించారు.
‘‘ ఎల్ఆరఎస్ పోవాలంటే గ్రేటర్‌లో టీఆర్ఎస్ పార్టీకి వీఆరఎస్ ఇవ్వాలి.. గ్రేటర్‌లో బీజేపీని గెలిపిస్తే కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌పై వెనక్కితగ్గడం ఖాయం.. రేపు బీజేపీ తొలి జాబితా విడుదల చేస్తాం.. బీజేపీలోకి భారీగా వలసలు పెరిగాయి.. 26 విభాగాలను ఏర్పాటు చేసుకున్నాం.. కుట్ర పూరితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.. సమయం ఎక్కువ ఇస్తే బీజేపీ వాళ్ళు గ్రేటర్ పీఠం తన్నుకుపోతారని టీఆర్ఎస్ భావిస్తుంది.. ఎన్నికల సమయం తక్కువగా ఉన్నా కూడా బీజేపీ గెలుపు ఖాయం ’’ అని లక్ష్హణ్ కామెంట్ చేశారు.
టీఆర్ఎస్ పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని, 18 లక్షల మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 428 మందికి మాత్రమే కేటాయించారని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ మంత్రి లక్ష ఇల్లు చూపిస్తామని చెప్పి అభాసుపాలు అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘ కేసీఆర్ మాట తప్పారు… ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ ఓట్లు అడుగుతారు? ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది.. ఆరోగ్య శ్రీ లోకి కరోనాని చేర్చలేదు.. హైదరాబాద్ నగరంలోని బస్తీలన్నీ చెరువులుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే.. టీఆర్ఎస్ కార్యకర్తల దోపిడీ కోసమే డబ్బు రూపంలో వరద సాయం చేశారు.. హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్‌ని నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు.. టీఆర్ఎస్ కుట్రలను తిప్పికొడతాం.. మార్పు కోసం బీజేపీని గెలిపించాలి.. ’’ అని అంటున్నారు బీజేపీ నేత లక్ష్మణ్.
ALSO READ: జగన్ హామీలన్నీ నీటి మూటలు.. వీడియో కాన్ఫరెన్సులో చంద్రబాబు కామెంట్లు
ALSO READ: జీహెచ్ఎంసీ బరిలో జనసేన.. బీజేపీకి సంకటమేనా?
ALSO READ: అళగిరికి బీజేపీ గాలం.. త్వరలో అమిత్‌షాతో అళగిరి భేటీ!