ఏడు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్ద్ ఫ్లూ, నియంత్రణకు సెంట్రల్ టీమ్స్ ని ఏర్పాటు చేసిన కేంద్రం.

| Edited By: Pardhasaradhi Peri

Jan 10, 2021 | 6:15 PM

దేశంలో బర్ద్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా  హర్యానా, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఇవి వెలుగు చూశాయి.  హర్యానా లోని పంచకుల జిల్లా..

ఏడు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్ద్ ఫ్లూ, నియంత్రణకు సెంట్రల్ టీమ్స్ ని ఏర్పాటు చేసిన కేంద్రం.
Follow us on

దేశంలో బర్ద్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా  హర్యానా, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఇవి వెలుగు చూశాయి.  హర్యానా లోని పంచకుల జిల్లా, గుజరాత్ లోని సూరత్, రాజస్తాన్ లోని సిరోహి జిల్లాల్లో ఈ కేసులను గుర్తించినట్టు వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్..కంగ్రా జిల్లాల్లో ఆదివారం 86 కాకులు మృతి చెందినట్టు అదిఒకరులు తెలిపారు. ఇదే రాష్ట్రంలోని నాహన్, బిలాస్ పూర్, మండిలో కూడా మరణించిన పక్షుల శాంపిల్స్ ని సేకరించారు. కేరళ, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీలో సైతం బర్ద్ ఫ్లూ కేసుల విజృంభణను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షణకు సెంట్రల్ టీమ్స్ ను నియమించింది. వీటిలో ఓ బృందం ఈ నెల 9 న కేరళను, మరో బృందం 10 న హిమాచల్ ను విజిట్ చేసింది. ఆయా చోట్ల సర్వే ను నిర్వహించింది. ఇక ముఖ్యంగా పౌల్ట్రీ ఫామ్స్ లో బయో సెక్యూరిటీని, జంతు ప్రదర్శనశాలలు, చెరువుల వద్ద, పక్షుల విక్రయ మార్కెట్ల వద్ద నిఘాను పెంచాలని, ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలను డిస్ ఇంఫెక్టెన్ట్ చేయాలని కేంద్రం సూచించింది.

 

Also Read:

Bitcoin Price : రాకెట్‌లా దూసుకుపోతున్న బిట్ కాయిన్.. 1.46 లక్షల డాలర్లకు చేరుకునే ఛాన్స్..

బ్యాచిలర్లూ తస్మాత్ జాగ్రత్త! ఆ వ్యాధి ముప్పు అధికమేనట.. హెచ్చరిస్తున్న పరిశోధకులు..

ఢిల్లీలో 2.25 లక్షలమంది హెల్త్ కేర్ వర్కర్లకు ‘తొలిదశ వ్యాక్సిన్లు’, 13 నుంచి మొదలు, ప్రభుత్వ ప్రకటన