కరోనాను కట్టడి చేసే ఆ ఇంజెక్షన్ ధర ఎంతంటే..?

|

Jul 14, 2020 | 8:56 PM

Biocon’s Itolizumab Drug: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపధ్యంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) సొరియాసిస్‌ను నయం చేసేందుకు ఉపయోగించే ‘ఇటోలీజుమ్యాజ్’ ఇంజెక్షన్‌ను తక్కువ మోతాదులో అత్యవసర సమయంలో కరోనా బాధితులకు వాడేందుకు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ మందును ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ బయోకాన్ సంస్థ తయారు చేసింది. తాజాగా ‘ఇటోలీజుమ్యాజ్’ ఇంజెక్షన్‌ ధరను రూ.8000గా సంస్థ నిర్ధారిస్తూ కీలక ప్రకటన చేసింది. శ్వాసకోశ సమస్యలున్న కరోనా రోగులకు అత్యవసర సమయాల్లో […]

కరోనాను కట్టడి చేసే ఆ ఇంజెక్షన్ ధర ఎంతంటే..?
Follow us on

Biocon’s Itolizumab Drug: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపధ్యంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) సొరియాసిస్‌ను నయం చేసేందుకు ఉపయోగించే ‘ఇటోలీజుమ్యాజ్’ ఇంజెక్షన్‌ను తక్కువ మోతాదులో అత్యవసర సమయంలో కరోనా బాధితులకు వాడేందుకు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ మందును ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ బయోకాన్ సంస్థ తయారు చేసింది. తాజాగా ‘ఇటోలీజుమ్యాజ్’ ఇంజెక్షన్‌ ధరను రూ.8000గా సంస్థ నిర్ధారిస్తూ కీలక ప్రకటన చేసింది.

శ్వాసకోశ సమస్యలున్న కరోనా రోగులకు అత్యవసర సమయాల్లో 25 ఎంజీ/5 ఎంఎల్ డోసులో ‘ఇటోలీజుమ్యాజ్’ ఇంజెక్షన్‌ను ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చినట్లు బయోకాన్ సంస్థ డైరెక్టర్ వెల్లడించారు. రోగులకు 4 వయల్స్ అవసరం ఉంటుంది కాబట్టి మొత్తం థెరపీ ఖర్చు రూ. 32,000 అవుతుందని ఆయన అన్నారు. కాగా, ఈ ఇంజెక్షన్ కరోనాకు చెక్ పెట్టే సైటోకిన్లను విడుదల చేయడంలో సమర్ధవంతంగా పని చేస్తుందని ఎయిమ్స్‌కు చెందిన పలువురు వైద్యులు గుర్తించారు. అయితే ఈ మందును తీసుకునే ముందు రోగులు రాతపూర్వకంగా అంగీకారం తెలిపాల్సి ఉంటుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Also Read:

కరోనా మృతుల అంత్యక్రియలకు రూ. 15 వేలు.. జగన్ సర్కార్ సంచలనం..

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..

కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం దూకుడు.. గ్రామాలకు ‘సంజీవని’..