బీహార్ ఎన్నికల వేళ, రాహుల్ పిక్నిక్ లో ఎంజాయ్ చేస్తున్నారు, నిప్పులు కక్కిన ఆర్జేడీ,

| Edited By: Anil kumar poka

Nov 16, 2020 | 9:57 AM

బీహార్ ఎన్నికల్లో విపక్ష మహాఘట్ బంధన్ ఓటమికి కాంగ్రెస్ పార్టీయే కారణమని తేజస్వి యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ ఆరోపించింది.

బీహార్ ఎన్నికల వేళ, రాహుల్ పిక్నిక్ లో ఎంజాయ్ చేస్తున్నారు, నిప్పులు కక్కిన ఆర్జేడీ,
Follow us on

బీహార్ ఎన్నికల్లో విపక్ష మహాఘట్ బంధన్ ఓటమికి కాంగ్రెస్ పార్టీయే కారణమని తేజస్వి యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ ఆరోపించింది. ఎన్నికల ఫలితాల సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  సిమ్లాలో తన సోదరి ప్రియాంక గాంధీ ఇంట్లో పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నారని ఆర్జేడీ నేత శివానంద్ తివారీ విమర్శించారు. మహాఘట్ బంధన్ కు ఆ పార్టీ అడ్డుపుల్లలా మారిందన్నారు. 70 సీట్లకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ కేవలం 19 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ఆర్జేడీ 75 స్థానాల్లో గెలుపొందగా లెఫ్ట్ పార్టీలు కూడా మంచి పనితీరును చూపాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 70 ర్యాలీలనైనా నిర్వహించలేదని, ప్రియాంక గాంధీ ఒక్కసారి కూడా ప్రచారానికి రాలేదని శివానంద్ తివారీ ఆరోపించారు. ఇది బీహార్ రాష్ట్రానికే కాదు. ఇతర రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందన్నారు. దీని గురించి ఆ పార్టీ ఆలోచించాలన్నారు. అటు కాంగ్రెస్ నేత తారిఖ్ అన్వర్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.