బీహార్ ఎన్నికలు, ‘షాట్ గన్’ కుమారుడు లవ్ సిన్హా వెనుకంజ

సినీనటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా బిహార్ ఎన్నికల్లో వెనుకంజలో ఉన్నారు. బంకి పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈయన..

బీహార్ ఎన్నికలు, షాట్ గన్ కుమారుడు లవ్ సిన్హా వెనుకంజ

Edited By:

Updated on: Nov 10, 2020 | 1:54 PM

సినీనటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా బిహార్ ఎన్నికల్లో వెనుకంజలో ఉన్నారు. బంకి పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈయన..మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్ నాబిన్ కన్నా వెనుకబడిపోయారు. ఈ నియోజకవర్గం పాట్నా సాహిబ్ లోక్ సభ స్థానం లోనిది. లోగడ శత్రుఘ్న సిన్హా బీజేపీలో ఉండగా ఈ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించారు. లవ్ సిన్హా ఎన్నికలబరిలోకి దిగడం ఇదే మొదటిసారి. బాలీవుడ్ లో ఈయన 2018 లో ‘పల్టన్’ మూవీలో నటించారు. 2010 లో మొదటిసారిగా ‘సాడియాన్’ చిత్రంతో అరంగేట్రం చేశారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us