గత మూడు సీజన్లు బిగ్ బాస్ రియాల్టీ షో చూసినవాళ్లకు ఒక విషయం మాత్రం పక్కా తెలుస్తోంది. హౌస్ లో ఎవర్ని అయితే మెంబర్స్ అందరూ టార్గెట్ చేస్తారో, వారికి జనాలు నుంచి మద్దతు లభిస్తుంది. ఆటోమేటిక్ పట్, పట్, పట్ అని ఓట్లు గుద్దేస్తారు. శివబాలాజీ, కౌశల్, రాహిల్ సిప్లిగంజ్ విషయంలో ఈ స్పష్టత వచ్చేసింది. గత సీజన్ విషయానికి వద్దాం. ప్రతిసారి నిన్ను నామినేట్ చేస్తానంటూ రాహుల్ సిప్లిగంజ్‍ని టార్గెట్ చేస్తూ మాట్లాడేది శ్రీముఖి. అది కాస్తా రాహుల్ కి పాజిటివ్ అంశంగా మారింది. దీంతో అసలు గేమ్ ప్లాన్ అంటూ లేకుండానే రాహుల్ బిగ్ బాస్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. అయితే ఇవన్నీ చూసి కూడా ఎక్కడ లాజిక్ మిస్సవుతున్నారో తెలియదు కానీ ప్రస్తుత సీజన్ లో మెజారిటీ మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయిని టార్గెట్ చేస్తున్నారు. మొదట ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని వీక్షకులు, సోమవారం నామినేషన్ ప్రక్రియలో మాత్రం కాస్త చిన్నబుచ్చుకున్నారు. ఆఖరికి గంగవ్వ కూడా కుమార్ సాయినే నామినేట్ చేసింది. దీంతో అతడికి ఊహించని సింపతీ దక్కింది.
మాములుగా జనాలు మైండ్ సెట్ అలాగ ఉంటుంది. ఒంటరి పోరాటం చేస్తున్న వ్యక్తివైపు నిలబడేలా మనసు ప్రొత్సహిస్తూ ఉంటుంది. ఇంకో రెండు, మూడు సీన్లు ఇలాంటివి రిపీట్ అయితే కుమార్ సాయికి బజ్ పెరిగిపోవడం ఖాయంలా కనిపిస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.
Also Read : ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ‘నో సోషల్ డిస్టేన్స్’