తొలిసారి బిగ్ బాస్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ.. ఆ కంటెస్టెంట్‌కు తన ఫుల్ సపోర్ట్ అంటోన్న టాలీవుడ్ రౌడీ.!

|

Dec 14, 2020 | 1:59 PM

బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకానికి చేరుకుంది. మరో వారం రోజుల్లో ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. ఎన్నో మలుపుల నడుమ ఈ షో ఆధ్యంతం రసవత్తరంగా సాగింది.

తొలిసారి బిగ్ బాస్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ.. ఆ కంటెస్టెంట్‌కు తన ఫుల్ సపోర్ట్ అంటోన్న టాలీవుడ్ రౌడీ.!
Follow us on

Bigg Boss 4: బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకానికి చేరుకుంది. మరో వారం రోజుల్లో ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. ఎన్నో మలుపుల నడుమ ఈ షో ఆధ్యంతం రసవత్తరంగా సాగింది. అభిజిత్, అఖిల్, హారిక, సోహైల్, అరియానాలు టాప్ 5లోకి చేరుకున్నారు. ఈ తరుణంలో టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ తొలిసారి బిగ్ బాస్‌పై స్పందిస్తూ, తనకు నచ్చిన కంటెస్టెంట్‌కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.

Also Read: బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్.! రన్నరప్ సోహైల్.. టాప్ 3లో అఖిల్.. చివరి స్థానంతో సరిపెట్టుకున్న అరియానా..!

అభిజిత్ హీరోగా నటించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ చిన్న రోల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ మూవీలో నటించిన వాళ్లందరితో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన రౌడీ.. ”బాయ్స్.. మీరు ఎక్కడున్నా.. ఎల్లప్పుడూ ది బెస్ట్ జరగాలని కోరుకుంటానని” అని పేర్కొన్నాడు. ఇన్‌డైరెక్ట్‌గా విజయ్ దేవరకొండ తన ఫ్రెండ్ అభిజిత్‌కు మద్దతు తెలపడంతో.. అతడి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Also Read: బిగ్ బాస్ ప్రైజ్ మనీతో ఏం చేస్తారు.? రైతుల కోసం డ‌బ్బు ప‌క్క‌న పెడతానన్న అరియానా.. శభాష్ అంటున్న నెటిజన్లు.!

ఇదిలా ఉంటే చాలా మంది సినీ ప్రముఖల మద్దతు అభిజిత్‌కే ఉన్న సంగతి తెలిసిందే. అలాగే క్రికెటర్ హనుమ విహారీ కూడా అతడికే తన మద్దతును తెలిపాడు. దీనితో ఎవరు ఎలా ఆడినా.. టాస్కుల్లో అద్భుతంగా పెర్ఫార్మన్స్ ఇచ్చినా.. జెంటిల్‌మాన్ గేమ్‌తో ఆకట్టుకుంటున్న అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అతడి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దీని బట్టి చూస్తే ఫినాలే మంచి రసవత్తరంగా సాగనుందని చెప్పాలి.

Also Read: బిగ్ బాస్ 4: దేత్త‌డి పాప సేఫ్.. మోనాల్ ఎలిమినేట్.! రసవత్తరంగా మారనున్న ఫినాలే పోటీ.. టాప్ 2లో ఎవరుంటారో.?