Bigg Boss 4: బిగ్‌బాస్ నాలుగో సీజన్ తొలి రెండు, మూడు వారాల్లో పెద్దగా స్క్రీన్ స్పేస్ లేకపోయినా.. ఆ తర్వాత టాస్కులలో విజృంభిస్తూ మెల్లమెల్లగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు మెహబూబ్. ఫిజికల్ టాస్క్‌లపైనే ఎక్కువగా దృష్టి సారించడం.. పలు సందర్భాల్లో హద్దు దాటడం వంటి విషయాలు అతన్ని ఎలిమినేషన్‌కు దారి తీశాయి.
ఇక బయటికొచ్చిన మెహబూబ్.. అభిజిత్, అఖిల్, సోహైల్‌కు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అలాగే తాజాగా తన బిగ్ బాస్ జర్నీని అభిమానులతో పంచుకున్నాడు. మొదటిగా తన గురువు అమ్మ రాజశేఖర్‌ను కలుస్తానని మెహబూబ్ తెలిపాడు. ఫిమేల్ కంటెస్టెంట్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటారు.? డేటింగ్ ఎవరితో.? చంపేది ఎవర్ని.? అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు.. దివితో పెళ్లి, హరికతో డేటింగ్, అరియానాను చంపుతానని మెహబూబ్ మొహమాటం లేకుండా ఆన్సర్ ఇచ్చాడు. అలాగే దివి ముక్కుసూటిగా మాట్లాడుతుందని.. అందంగా ఉంటుందని అన్నాడు. అరియానా పైకి చూడడానికి బోల్డ్‌గా కనిపించినా.. లోపల మాత్రం చాలా ఇన్నోసెంట్ అని మెహబూబ్ అన్నాడు. ఇక హారిక విషయానికి వస్తే ఆమె ఫైటర్ అని.. టాస్కులలో అబ్బాయిలతో ధీటుగా ఆడుతుందని పేర్కొన్నాడు.
Also Read:
జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!
ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..