Bigg Boss 4: బుల్లితెర పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 4 పదమూడో వారం చివరికి వచ్చింది. ఈ వారం అభిజిత్, హారిక, అవినాష్, అఖిల్, మోనాల్‌లు ఎలిమినేషన్స్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వీరిలో అఖిల్‌ను సేవ్ చేయడమే కాకుండా ఫస్ట్ ఫైనలిస్ట్‌గా హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించాడు.
ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా అభిజిత్ ఓటింగ్ పర్సెంటేజ్‌లో అగ్రస్థానంలో ఉండగా.. హారిక కూడా సేఫ్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోసారి బిగ్ బాస్ దత్తపుత్రిక మోనాల్ గజ్జర్ ఈ వారం కూడా ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయిందని సమాచారం. ఈ పదమూడో వారంలో జబర్దస్త్ ముక్కు అవినాష్‌ను బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా దీనిపై ప్రచారం సాగుతోంది.
నిజానికి ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న హౌస్‌మేట్స్‌లో అవినాష్, మోనాల్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. అందరి కంటే తక్కువ ఓట్లు అవినాష్‌కే వచ్చాయని వినికిడి. కాగా, గత కొద్దిరోజుల నుంచి హౌస్‌లో అవినాష్ ప్రవర్తిస్తున్న తీరుకు అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారని చెప్పాలి.