లగడపాటి పక్కన నూతన్ నాయుడు..లింక్ ఏంటబ్బా?

ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ ఎన్నికల సర్వే వచ్చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ గెలుస్తుందని ఒక రోజు ముందుగానే సంకేతాలు ఇచ్చిన లగడపాటి రాజగోపాల్… ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై అంచనాలు వెల్లడించారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో టీడీపీకి 100 సీట్లు,  వైసీపీకి 72 సీట్లు, ఇతరులకు 1-3 సీట్లు వచ్చే అవకాశ ఉందని లగడపాటి రాజగోపాల్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ, వైసీపీ విషయంలో […]

లగడపాటి పక్కన నూతన్ నాయుడు..లింక్ ఏంటబ్బా?

Updated on: May 19, 2019 | 10:26 PM

ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ ఎన్నికల సర్వే వచ్చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ గెలుస్తుందని ఒక రోజు ముందుగానే సంకేతాలు ఇచ్చిన లగడపాటి రాజగోపాల్… ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై అంచనాలు వెల్లడించారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో టీడీపీకి 100 సీట్లు,  వైసీపీకి 72 సీట్లు, ఇతరులకు 1-3 సీట్లు వచ్చే అవకాశ ఉందని లగడపాటి రాజగోపాల్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ, వైసీపీ విషయంలో ఒక పది సీట్లు అటూ, ఇటూగా మారొచ్చని చెప్పారు

అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వే విషయాల సంగతి అటుంచితే… లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రెస్ మీట్‌ని అబ్జర్వ్ చేస్తే ..ఆయన పక్కనే కూర్చున్న వ్యక్తి మనకు ఎక్కడో చూపినట్టు అనిపిస్తుంది. ఇంతకీ అతను ఎవరో కాదు. ‘బిగ్‌బాస్’ పార్టిసిపెంట్ నూతన్ నాయుడు. అసలు నూతన్ నాయుడుకీ, లగడపాటి రాజగోపాల్‌కు సంబంధం ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసే ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు చెప్పేటప్పుడు లగడపాటి పక్కన ఆయన ఎందుకున్నాడనే అనుమానం చాలామందికి కలుగుతోంది.

ప్రత్యేక్ష రాజకీయాల్లోని ఘనంగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడేమోనని కొందరు భావిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నూతన్ నాయుడు… కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనల్లో ఉన్నట్టు సమాచారం. ఈసారి కాకపోయినా వచ్చే ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, అప్పుడు తనకు టికెట్ పక్కా అవుతుందనే ఉద్దేశంతో లగడపాటి అండ్ కోతో సన్నిహితంగా మెలుగుతున్నట్టు తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us