ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. పీపీఏలను రద్దు చేయొద్దని విద్యుత్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ పీపీఏ ఒప్పందాలను సమీక్షించాలని ప్రభుత్వం భావించింది. దీంతో విద్యుత్ సంస్ధలు విద్యుత్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. కడప, అనంతపురం జిల్లాలకు చెందిన కంపెనీలు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యుత్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేశాయి. దీంతో విచారించిన ట్రిబ్యునల్ పీపీఏ ఒప్పందాలను రద్దు చేయోద్దని ప్రభుత్వాన్ని ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పీపీఏ రద్దు అంశంలో పబ్లిక్ హియరింగ్‌లను చేపట్టవద్దని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికారం చేపట్టిన తర్వాత వైసీపీ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సమీక్షిస్తూ పీపీఏల రద్దు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ విషయంలో కూడా ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.