బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: బిల్లు ఎవరికి ముల్లు

| Edited By:

Dec 11, 2019 | 11:05 PM

పౌరసత్వ సవరణ బిల్లు ఈనాశ్య రాష్ట్రాల్లో చిచ్చురేపింది. కోటిన్నర మందికి ఉపయోగమని ఆరెస్సెస్‌ చెబుతుంటే, కోట్లమంది ప్రజలు ఎందుకు ఆందోళన చెందుతున్నారన్నదే చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు పౌరసత్వ బిల్లు విఘాతమని విపక్షాలు హెచ్చరిస్తుంటే, ప్రభుత్వం మాత్రం ముస్లింలు భయపడాల్సిన పనిలేదని సరిపెడుతోంది. పౌరసత్వ సవరణ బిల్లు హిందూ ఎజెండాలో భాగమా, ఓట్లకోసమేనా అన్నది ఇవాళ్టి బిగ్‌ డిబేట్‌. ఎన్నార్సీ ప్రయోగం తర్వాత కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు లోక్‌సభలో సులభంగానే పాసైనా రాజ్యసభలో […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: బిల్లు ఎవరికి ముల్లు
Follow us on

పౌరసత్వ సవరణ బిల్లు ఈనాశ్య రాష్ట్రాల్లో చిచ్చురేపింది. కోటిన్నర మందికి ఉపయోగమని ఆరెస్సెస్‌ చెబుతుంటే, కోట్లమంది ప్రజలు ఎందుకు ఆందోళన చెందుతున్నారన్నదే చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు పౌరసత్వ బిల్లు విఘాతమని విపక్షాలు హెచ్చరిస్తుంటే, ప్రభుత్వం మాత్రం ముస్లింలు భయపడాల్సిన పనిలేదని సరిపెడుతోంది. పౌరసత్వ సవరణ బిల్లు హిందూ ఎజెండాలో భాగమా, ఓట్లకోసమేనా అన్నది ఇవాళ్టి బిగ్‌ డిబేట్‌.

ఎన్నార్సీ ప్రయోగం తర్వాత కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు లోక్‌సభలో సులభంగానే పాసైనా రాజ్యసభలో మాత్రం ప్రభుత్వానికి టెన్షన్‌ పుట్టించింది. లోక్‌సభలో ఒవైసీలాగా బిల్లును చింపేసిన సెంటిమెంట్‌ పండకపోయినా, రాజ్యాంగానికి విరుద్ధంగా వెళుతున్నారని విపక్షం మూకుమ్మడిగా ఎదురుదాడిచేసింది. ఎన్నార్సీని, పౌరసత్వ సవరణను బెంగాల్లోనే కాదు, దేశమంతా అమలుపరచకుండా అడ్డుకుంటామని తృణమూల్‌ కాంగ్రెస్‌ హెచ్చరించింది. కాంగ్రెస్‌ మాత్రం అటార్నీ జనరల్‌ను సభకు రప్పించి, తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిస్తారా అంటూ సవాల్‌ విసిరింది. మోదీ సర్కార్‌ వివక్షపూరిత చర్యలు రాజ్యాంగానికి విరుద్ధమని టీఆర్‌ఎస్‌ వాదించింది.