ఆపద్భాందవులకు చట్టపరమైన రక్షణ.. ఇక నుంచి వారిపై నో కేసులు..

|

Oct 03, 2020 | 5:58 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేసేందుకు చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే..గాయపడిన వారిని కాపాడేంత వరకు ఓకే. కానీ, ఆ తర్వాత పోలీస్ కేసులు..

ఆపద్భాందవులకు చట్టపరమైన రక్షణ.. ఇక నుంచి వారిపై నో కేసులు..
Follow us on

Police will not trouble Good Samaritans: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేసేందుకు చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే..గాయపడిన వారిని కాపాడేంత వరకు ఓకే. కానీ, ఆ తర్వాత పోలీస్ కేసులు, విచారణ పేరుతో పీఎస్ చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో సహాయం చేయాలనుకున్న వారు కూడా వెనకడుగు వేస్తుంటారు. అయితే తాజాగా అలాంటివారికి కేంద్రం చట్టపరంగా అండగా నిలిచింది.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేసే ఆపద్భాందవులపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులు ఉండబోవని తాజాగా ఉత్తర్వుల్లో పేర్కొంది. వాహన ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన వారు, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించిన వారు.. పోలీసులు అనుమతి లేకుండానే తక్షణం వెళ్లిపోవచ్చునని.. వారి వివరాలను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే ఎవరైనా కేసులో ప్రత్యక్ష సాక్షిగా మారేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తే.. వారిని నిబంధనల ప్రకారం పరిశీలిస్తామని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో హిందీ, ఇంగ్లీష్, మాతృభాషల్లో ఈ చట్టం కింద వచ్చే రూల్స్ గురించి, ఆపద్భాందవుల హక్కుల గురించి పేర్కొవాలని తెలిపింది.

Also Read:

గ్రామ/వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

సోనూసూద్ గొప్ప మనసు.. బాలుడి వైద్యానికి రూ. 20 లక్షల సాయం..

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పండగ సీజన్‌లో 200 స్పెషల్ ట్రైన్స్.!