పాకిస్తాన్‌పై నిప్పులు గక్కిన యూరోపియన్ పార్లమెంటు

|

Oct 22, 2020 | 6:18 PM

అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చెబుతున్నదంతా అవాస్తమేనని, అసలు వాస్తవాలను పాకిస్తాన్ దాస్తోందని యూరోపియన్ పార్లమెంటు..

పాకిస్తాన్‌పై నిప్పులు గక్కిన యూరోపియన్ పార్లమెంటు
Follow us on

Big defeat for Pakistan in International community:  అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చెబుతున్నదంతా అవాస్తమేనని, అసలు వాస్తవాలను పాకిస్తాన్ దాస్తోందని యూరోపియన్ పార్లమెంటు కుండబద్దలు కొట్టింది. 1947 అక్టోబర్ 22న తాను గిరిజన వర్గాలతో కశ్మీరీలపై దాడులు చేయించిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిన పాకిస్తాన్ అక్టోబర్ 27న భారత్ కశ్మీర్‌ను ఆక్రమించుకుందంటూ బ్లాక్ డేగా పాటిస్తోందని పార్లమెంటు సభ్యులు దుయ్యబట్టారు.

అక్టోబర్ 27 ముందున్న నేపథ్యంలో పాకిస్తాన్ టెర్రరిస్టుల పోషణపై యూరోపియన్ పార్లమెంటు లోతుగా చర్చించింది. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా తమ భూభాగంలో తీవ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తోందని అభిప్రాయపడింది. అంతటితో ఆగకుండా… 1947 అక్టోబర్‌లో జరిగిన ఉదంతాలపై యూరోపియన్ యూనియన్ కీలక కామెంట్లు పాస్ చేసింది. అక్టోబర్ 22, 1947న ట్రైబల్స్‌ని కశ్మీరీలపై ఉసిగొల్పి… 35 వేల మంది హిందూ, ముస్లిం, సిక్కుల ప్రాణాలను పాకిస్తాన్ బలిగొన్నదని.. కశ్మీరీ రాజు ఇండియన్ ప్రభుత్వాన్ని ఆశ్రయించి, విలీనాన్ని ప్రకటించిన తర్వాతనే భారత సైన్యం కశ్మీర్‌లోకి ప్రవేశించిందని యూరోపియన్ పార్లమెంటు పాస్ చేసిన తీర్మానంలో పేర్కొంది.

ప్రపంచంలో ఇప్పటికే తీవ్రవాదుల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పాకిస్తాన్‌లో పుట్టి పెరుగుతున్న తీవ్రవాద సంస్థలకు నిధులు చేరేందుకు ఇక ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని యూరోపియన్ పార్లమెంటు యూరోపియన్ యూనియన్ దేశాలను మరీ ముఖ్యంగా ఫ్రాన్స్‌ని కోరింది. ఈ మేరకు యూరోపియన్ పార్లమెంటు సభ్యులు రిజ్దార్డ్ జర్నెస్కీ, ఫువియో మర్ట్జుస్సిల్లో, గియాన్నా గర్సియా ఈయూ దేశాలకు లేఖలు రాశారు.

కశ్మీర్‌లో అక్టోబర్ 27న 73వ బ్లాక్ డేగా పాకిస్తాన్ పాటించబోతున్న నేపథ్యంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ దేశాలు గళమెత్తాలని లేఖలో వారు కోరారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మాక్రోన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డే లేయాన్‌లను ఉద్దేశించి యూరోపియన్ పార్లమెంటు సభ్యులు లేఖలు రాశారు.

కశ్మీర్‌తో పాటు తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లో పాకిస్తాన్ చేసిన దుశ్చర్యలను ప్రపంచం ఎప్పటికీ మరిచిపోలేదని లేఖల్లో పేర్కొన్నారు. ఇస్లామిక్ తీవ్రవాదులు 3 లక్షల నుంచి 30 లక్షల మంది దాకా బెంగాలీలను వధించారని, 2 లక్షల నుంచి 4 లక్షల మంది దాకా బెంగాలీ మహిళలపై అత్యాచారాలు చేశారని ప్రస్తావించారు. ఈ దుశ్చర్యలపై న్యాయం కోసం బంగ్లాదేశ్ ఇప్పటికీ అంతర్జాతీయ కోర్టులో పోరాడుతోందని తెలిపారు. అమెరికాపై దాడులకు తెగబడిన అల్‌ఖైదా వ్యవస్థాపకుడు బిల్ లాడెన్‌ను పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ యుద్ధ వీరునిగా కీర్తించడాన్ని యూరోపియన్ పార్లమెంటు సభ్యులు తప్పుపట్టారు.

Also read: వైమానిక దాడుల్లో 8 మంది పౌరులు హతం

Also read:  అమరావతిలో స్తబ్దత.. రాజధానిపై చంద్రబాబు కీలక ట్వీట్

Also read: అరెస్టును అడ్డుకుని హంగామా చేసిన మహిళలు

Also read: పొద్దుటూరులో భారీ గోల్డ్ గోల్‌మాల్

Also read: “నాగ్” మిసైల్ ప్రయోగం సక్సెస్

Also read: కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సీఎం కీలక ప్రకటన