ఆ దేశంలో నేటి నుంచి ఏడు రోజుల పాటు లాక్‌డౌన్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసుల కాస్త తగ్గుముఖం...
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసుల కాస్త తగ్గుముఖం పడుతున్నాయనుకుంటే తాజాగా కొత్త కరోనా వైరస్ మరింత భయపెట్టిస్తోంది. కొత్త కరోనా వైరస్ రావడంతో కరోనా కట్టడిలో భాగంగా భూటాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఏడు రోజుల పాటు ఆ దేశ వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భూటన్ ప్రభుత్వం పేర్కొంది. రాజధాని థింఫూతో పాటు పారో, లామోయింజింగ్ఖా తదితర ప్రాంతాల్లో కోవిడ్ -19 సామాజిక వ్యాప్తి కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
లాక్‌డౌన్ సమయంలో అన్ని అత్యవసరసేవలు అందుబాటులో ఉంటాయని, పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, ఇతర సంస్థలు మూసివేస్తామని ప్రధాని కార్యాలయం పేర్కొంది. సరుకులు, కూరగాయలు, పశువుల దాణాలతో పాటు పలు వస్తువులు అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని, ఎవరైనా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కేసుల కేసుల నేపథ్యంలో పలు దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించక తప్పడం లేదు. కరోనా కట్టడికి ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇందు కోసం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం వ్యాక్సిన్ తయారీలో తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి.కొన్ని వ్యాక్సిన్లు ఒకటి, రెండు ప్రయోగ దశల్లో ఉంటే, మరి కొన్ని వ్యాక్సిన్లు తది దశలో ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లోనే మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ఆయా దేశాలు సిద్ధమవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం.. ఒక్క రోజులో పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్ని నమోదయ్యాయంటే..!