లెజండరీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమాలో నటించనే వద్దంటూ విజయ్‌సేతుపతికి ప్రముఖ దర్శకుడు భారతీరాజా సూచన చేశారు.. మురళీధరన్ నమ్మకద్రోహి అంటూ భారతీరాజా వ్యాఖ్యానించారు.. శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ మురళీధరన్ జీవితం ఆధారంగా 800 పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు.. టెస్ట్ క్రికెట్‌లో 800 వికెట్లు తీసుకున్న ఏకైక బౌలర్ అతడే! అందుకే సినిమాకు ఆ పేరు పెట్టారు.. ఈ సినిమాలో ముత్తయ్య మురళీధరన్ పాత్రను విజయ్ సేతుపతి నటిస్తున్నారు.. ఎమ్‌ఎస్ శ్రీపతి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. ఆల్‌రెడీ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు.. ఇప్పటికే మురళీధరన్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి నటిస్తుండటంపై తమిళ సంఘాలు విరుచుకుపడుతున్నాయి. శ్రీలంకలో తమిళులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ, వారిని తీవ్రంగా అణచివేస్తూ ఎన్నో దారుణాలకు పాల్పడింది శ్రీలంక ప్రభుత్వం.. శ్రీలంక మతవాదనకు మురళీధరన్ కూడా మద్దతు తెలిపాడని, ఆయన నమ్మకద్రోహి అని భారతీరాజా అన్నారు. దర్శకులు శీను రామస్వామి, చేరన్ కూడా 800 సినిమాలో నటించవద్దంటూ విజయ్‌సేతుపతికి విన్నవించుకున్నారు.