Bharat Bandh: భారత్ బంద్ సక్సెస్ అయింది..సంతోషం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్., అయితే హౌస్ అరెస్ట్ చేసినట్టా ?లేదా ?

| Edited By: Pardhasaradhi Peri

Dec 08, 2020 | 9:51 PM

అన్నదాతలు తలపెట్టిన భారత్ బంద్ విజయవంతమైందని, ఇందుకు తనకు సంతోషంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గృహ నిర్బంధంలో ఉన్న తను ఇంట్లోనే రైతుల ప్రయోజనాలకోసం ప్రార్థించానని..

Bharat Bandh: భారత్ బంద్ సక్సెస్ అయింది..సంతోషం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్., అయితే హౌస్ అరెస్ట్ చేసినట్టా ?లేదా ?
Follow us on

అన్నదాతలు తలపెట్టిన భారత్ బంద్ విజయవంతమైందని, ఇందుకు తనకు సంతోషంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గృహ నిర్బంధంలో ఉన్న తను ఇంట్లోనే రైతుల ప్రయోజనాలకోసం ప్రార్థించానని ఆయన చెప్పారు. సింఘు బోర్డర్ వద్ద నిరసన తెలుపుతున్న అన్నదాతల వద్దకు వెళ్లి వారికి మద్దతు తెలపాలనుకున్నానని, కానీ పోలీసులు తనను ఆపివేశారని ఆయన వెల్లడించారు.  నేను రైతుల పక్షమే అన్నారాయన. కేజ్రీవాల్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారని మొదట వార్తలు  రాగా, అలాంటిదేమీ లేదని, తాము ఆయనను హౌస్ అరెస్టు చేయలేదని పోలీసులు ఆ వార్తలను ఖండించారు. నన్ను ఆపకపోయి ఉంటే రైతలవద్దకు వెళ్లి వారి ఆందోళనకు నేను సంఘీభావం తెలిపేవాడిని అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

కాగా తమ ముఖ్యమంత్రిని పోలీసులు గృహ నిర్బంధం చేశారంటూ డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా సీఎం ఇంటివద్ద  ధర్నా చేశారు. తమను పోలీసులు ఆయన ఇంటిలోకి వెళ్లనివ్వలేదని ఆయన ఆరోపించారు. కానీ వారు మాత్రం సీఎం ని హౌస్ అరెస్టు చేయలేదని వాదిస్తున్నారు అని ఆయన అన్నారు. ఇంతకీ కేజ్రీవాల్ ప్రభుత్వం సాక్షాత్తూ రైతు చట్టాలను అమలు చేస్తోందని, కానీ ఏమీ తెలియనట్టు తమ  ఆందోళనను సమర్థిస్తోందని రైతు సంఘాల నేతలు ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. బహుశా ఇందువల్లే వారి ఆగ్రహాన్ని ఎక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందోనని కేజ్రీవాల్.. ‘హౌస్ అరెస్ట్’ డ్రామాకు  తెర తీసినట్టు కనిపిస్తోందని అంటున్నారు.