Munugodu: పొరుగు రాష్ట్రంలో బై పోల్ హీట్.. కోట్లల్లో బెట్టింగ్.. గెలుపోటములపై భారీగా పందేలు..

|

Oct 26, 2022 | 1:08 PM

మునుగోడు బై పోల్ హీట్ పక్క రాష్ట్రానికి తాకింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఇదే ఇష్యూపై డిస్కషన్ జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లోనూ చర్చ జోరందుకుంది. అక్కడ ఉప ఎన్నిక పై..

Munugodu: పొరుగు రాష్ట్రంలో బై పోల్ హీట్.. కోట్లల్లో బెట్టింగ్.. గెలుపోటములపై భారీగా పందేలు..
Betting In Munugodu
Follow us on

మునుగోడు బై పోల్ హీట్ పక్క రాష్ట్రానికి తాకింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఇదే ఇష్యూపై డిస్కషన్ జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లోనూ చర్చ జోరందుకుంది. అక్కడ ఉప ఎన్నిక పై భారీగా బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు.. మునుగోడు బై పోల్ గెలుపోటములపై ఇప్పటికే వందల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది. గ్రౌండ్ రియాల్టీ కోసం బెట్టింగ్ బృందాల నిరంతరం సర్వే నిర్వహిస్తుండటం గమనార్హం. ఓటరు నాడీ ని తెలుసుకోడానికి ఆ రాష్ట్రానికి చెందిన యువకులు మునుగోడులో చక్కర్లు కొడుతున్నారు. మారుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ముఠాకు చేరవేస్తూ పందేలకు పాల్పడుతున్నారు. అంతే కాకుండా స్థానికంగానూ బెట్టింగ్ లు కొనసాగుతుండటం విస్తుగొలుపుతోంది. బెట్టింగ్ కు కాదేది అనర్హం అన్నట్లుగా జరుగుతున్న పందేలు చర్చనీయాంశంగా మారాయి.

టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ల ప్రచారం కూడా మునుగోడు ఉప ఎన్నికలో ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి విజయావకాశాలపై అంచనాలు వేస్తున్నారు. బెట్టింగ్‌ వేస్తూ కోట్ల రూపాయల్లో లావా దేవీలు సాగిస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డిపై రూ.50 వేలు, కూసుకుంట్లపై రూ.30 వేలు, స్రవంతి గెలుపుపై రూ.20 వేల చొప్పున బెట్టింగ్ వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. బెట్టింగ్ వేసినా నగదుకు రెట్టింపు చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు.

మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు నల్గొండ జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణా రెడ్డి వివరాలు వెల్లడించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వెంటనే పోలింగ్‌ కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వెబ్‌ కాస్టింగ్‌, సిబ్బందికి ఇబ్బందులు లేకుండా వసతుల కల్పన పై దృష్టి సారించినట్లు చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా 105 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక పరిశీలకులను నియమించినట్లు కలెక్టర్ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..