ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో లింక్ ఉన్న బెంగుళూరు డాక్టర్ ఒకరిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అధికారులు అరెస్టు చేశారు. 28 ఏళ్ళ అబ్దుర్ రెహమాన్ అనే ఈ వైద్యుడు బెంగుళూరు లోని ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. ఇండియాలో ఐసిస్ కార్యకలాపాలను రహస్యంగా విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు వెల్లడైంది. 2014 లో సిరియా వెళ్లి అక్కడ గాయపడిన ఉగ్రవాదులకు చికిత్సలు కూడా చేశాడట. పది వైద్య శిబిరాలను సందర్శించి ఇండియాకు తిరిగి వచ్చాడని అధికారులు తెలిపారు. కాశ్మీర్ లో జహాన్ జైబ్ సమీ ,అతని భార్య హీనా బేగ్ లను గత మార్చిలో అరెస్టు చేశారని ఐసిస్ తో సంబంధాలున్న ఓ సంస్థతో లింక్ ఉన్న వారితో కూడా అబ్దుర్ రెహమాన్ కాంటాక్ట్ లో ఉన్నాడని తెలిసింది.