Beauty Secrets: మీ పెదవులు నల్లగా ఉన్నాయా.. చర్మం కాంతివంతం కావాలా ఐతే కొత్తిమీరతో ఇలా చేస్తే సరి

|

Jun 16, 2021 | 6:03 PM

Beauty Secrets: ధనియాల మొక్కలే కొత్తిమీర. మంచి సువావన కలిగి ఉంటుంది. వంటకాలలో విరివిగా వాడతారు. తెలుగువారు దాదాపు ప్రతి కూరలో దీనిని...

Beauty Secrets: మీ పెదవులు నల్లగా ఉన్నాయా.. చర్మం కాంతివంతం కావాలా ఐతే కొత్తిమీరతో ఇలా చేస్తే సరి
Face Pack
Follow us on

Beauty Secrets: ధనియాల మొక్కలే కొత్తిమీర. మంచి సువావన కలిగి ఉంటుంది. వంటకాలలో విరివిగా వాడతారు. తెలుగువారు దాదాపు ప్రతి కూరలో దీనిని వేస్తారు. అంతేకాక కొత్తిమీరతో పచ్చడి కూడా చేస్తారు. కొత్తిమిరి నిండా విటమిన్లు ,ఖనిజ లవణాలు ఉన్నాయి . అంతేకాదు సమృద్ధి గా ఐరన్ కుడా లభిస్తుంది. దీనిని కేవలం వంటింటి పదార్థంగా మాత్రమే కాకుండా కొత్తిమీరను ఔషధంగా కూడా వాడవచ్చు. కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ సుగంధతత్వాలూ, ఔషధ తత్వాలూ అనేకం ఉంటాయి. ఈమధ్య జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర ఫుడ్ పాయిజనింగ్‌లో అత్యంత ప్రయోజనకారిగా పనిచేస్తుందని తేలింది. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కొత్తిమీర ఉపయోగపడుతుంది.

కొత్తిమీర తో అందానికి చిట్కాలు:

పెదవులు నల్లగా ఉన్నవారు రోజూ రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసం పెదవులపై రాయండి.కొన్ని రోజులకి పెదాలు లేత రంగును సంతరించుకొంటాయి.

కొందరిలో చర్మంపై చిన్న వయసులోనే ముడతలు పడతాయి. అలాంటి వారు ఈ చిట్కా పాటించండి. కొత్తిమీరను పేస్ట్ చేసి దానిలో కొంచెం కలబంద గుజ్జును కలపండి. ఆ పేస్టుకు ముఖానికి రాసుకోండి. కొంత సేపు తర్వాత చల్లటి నీటిలో ముఖాన్ని కడుక్కోండి. ఇలా ఒక 15 రోజులు వీడకుండా చేస్తే.. ముఖం మంచి వర్చస్సు తో మెరుస్తూ ఉంటుంది.

ఏదైనా కూర వండేటపుడు కాకుండా చివరలో అంటే దించివేసే ముందు వేస్తేనే కూరకు మంచి సువాసన వస్తుంది.

కొత్తిమీర త్వరగా వాడిపోకుండా ఉండాలంటే ఓ గ్లాసులో నీరు పోసి వాటి వేర్లు మునిగేటట్లు ఉంచండి.

మీ ఇంటి వెనుక కాస్త స్థలం ఉందా? ఉంటే కాసిన్ని ధనియాలు చల్లి నీరు చిలకరించండి కొత్తిమీర వస్తుంది.ఒకవేళ స్థలం లేకపోయినా పూలకొండీలలో చల్లినా చాలు.

Also read: కాశ్మీర్ , సిమ్లా యాపిల్స్ తో పాటు ఇక నుంచి నాసిక్ యాపిల్స్ కూడా వస్తున్నాయి