ఏనుగెక్కినంత సంబరం, ట్రక్కుపైకెక్కి ఎలుగు ‘నవ్విందండీ’
ఎక్కడా లేనట్టు ఓ ఎలుగుబంటి చెట్టు ఎక్కినట్టే ఏకంగా ఓ ట్రక్కుపైకి ఎక్కేసింది. చెత్తను తీసుకుపోయే ఆ వాహనాన్ని ఎలా ఎక్కిందనుకుంటున్నారా ? దానికి పైకి ఎక్కేందుకు మెటల్ స్టెప్స్ ఉన్నాయి మరి !
ఎక్కడా లేనట్టు ఓ ఎలుగుబంటి చెట్టు ఎక్కినట్టే ఏకంగా ఓ ట్రక్కుపైకి ఎక్కేసింది. చెత్తను తీసుకుపోయే ఆ వాహనాన్ని ఎలా ఎక్కిందనుకుంటున్నారా ? దానికి పైకి ఎక్కేందుకు మెటల్ స్టెప్స్ ఉన్నాయి మరి ! ఆ ‘మెట్లపై’ తన భారీ శరీరంతో ఎలా ఎక్కిందో గానీ, పైన తన ‘సాహస కార్యానికి’ తానే మురిసిపోతున్నట్టు, ఎంజాయ్ చేస్తున్నట్టు ‘పళ్ళికిలించింది’. దాని పోజును చూసి ఆశ్చర్యపోతూనే ఎవరో ఫోటో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగానే ఆ ఫొటోలన్నీ వైరల్ అయ్యాయి. అమెరికాలోని పెన్సిల్వేనియా పోలీసు స్టేషన్ ముందు కనబడిన ఈ ‘అపురూప’, ‘అరుదైన’ దృశ్యం వావ్ అనిపించింది. కాసేపు ట్రక్కుపైనే తన అవతారాన్ని చూపాక ఆ ఎలుగు మళ్ళీ జాగ్రత్తగా దిగి వచ్ఛేసిందట! వీడియో లేదు గానీ ఉంటేనా ?