కోడెల మృతి పై వైద్యుల ప్రకటన..

కోడెల శివప్రసాదరావు మృతిపై బసవతారకం ఆస్పత్రి వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11.35 నిమిషాలకు కోడెలను అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. 12.39 నిమిషాలకు కోడెల చనిపోయినట్లు ఆస్పత్రి సీఈవో డా.ఆర్.వి ప్రభాకర్ రావు ప్రకటించారు. ఆయన్ని కాపాడేందుకు చివరి వరకూ ప్రయత్నించామని చెప్పారు. ఆస్పత్రి విషయానికొస్తే.. కోడెల దంపతులు విదేశాలు తిరిగి ఫండ్స్ తీసుకువచ్చారని ఈ ఆస్పత్రిని కట్టారని అన్నారు. ఎంతోమందికి ఎనలేని సేవ చేశారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయన […]

కోడెల మృతి పై వైద్యుల ప్రకటన..

Edited By:

Updated on: Sep 16, 2019 | 6:14 PM

కోడెల శివప్రసాదరావు మృతిపై బసవతారకం ఆస్పత్రి వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11.35 నిమిషాలకు కోడెలను అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. 12.39 నిమిషాలకు కోడెల చనిపోయినట్లు ఆస్పత్రి సీఈవో డా.ఆర్.వి ప్రభాకర్ రావు ప్రకటించారు. ఆయన్ని కాపాడేందుకు చివరి వరకూ ప్రయత్నించామని చెప్పారు. ఆస్పత్రి విషయానికొస్తే.. కోడెల దంపతులు విదేశాలు తిరిగి ఫండ్స్ తీసుకువచ్చారని ఈ ఆస్పత్రిని కట్టారని అన్నారు. ఎంతోమందికి ఎనలేని సేవ చేశారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయన మృతిచెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు కోడెల మృతి పై విచారణ చేపట్టిన పోలీసులు.. బంజారాహిల్స్‌లోని ఆయన ఇంట్లో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయన ఇంట్లోని పనిమనుషులను విచారిస్తున్నారు.