AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BAN vs PAK: ఛీ, ఛీ.. సొంతగడ్డపైనేకాదు.. పొరుగు దేశంలోనూ పాక్ జట్టు ఇజ్జత్ పాయే..

Bangladesh vs Pakistan 1st Test 2026: అంతర్జాతీయ క్రికెట్‌లో బంగ్లాదేశ్ మరోసారి సంచలనం సృష్టించింది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను వరుసగా మూడోసారి టెస్ట్ మ్యాచ్‌లో మట్టికరిపించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా బంగ్లా యువ ఫాస్ట్ బౌలర్ నాహిద్ రాణా నిప్పులు చెరిగే బంతులతో పాకిస్థాన్ బ్యాటింగ్ వెన్నెముకను విరిచి, తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

BAN vs PAK: ఛీ, ఛీ.. సొంతగడ్డపైనేకాదు.. పొరుగు దేశంలోనూ పాక్ జట్టు ఇజ్జత్ పాయే..
Ban Vs Pak
Venkata Chari
|

Updated on: May 12, 2026 | 5:11 PM

Share

Bangladesh vs Pakistan 1st Test 2026: మీర్‌పుర్‌లోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం సాక్షిగా మే 12న జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 104 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. గత రెండేళ్ల కాలంలో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. 2024లో పాకిస్థాన్ గడ్డపైనే ఆ జట్టును క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా పులులు, ఇప్పుడు సొంత గడ్డపై కూడా అదే జోరును కొనసాగిస్తూ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లాయి.

నాహిద్ రాణా వేగానికి దాయాది జట్టు కవావికలం..

ఈ మ్యాచ్‌లో అసలైన మలుపు బంగ్లాదేశ్ యువ పేసర్ నాహిద్ రాణా రూపంలో వచ్చింది. భారీ కాయం, మెరుపు వేగంతో బంతులు విసిరిన రాణా, పాకిస్థాన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో సగం మంది ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపాడు. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ బ్యాటర్లు రాణా వేగాన్ని అంచనా వేయలేక వరుసగా వికెట్లు పారేసుకున్నారు. దీంతో 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కనీసం పోరాటం కూడా చేయలేకపోయింది.

మ్యాచ్ సాగిందిలా..

రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. పాకిస్థాన్ ముందు 268 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చేతిలో 70 ఓవర్లకు పైగా సమయం ఉన్నప్పటికీ, పాకిస్థాన్ బ్యాటర్లు బంగ్లా బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. కేవలం 163 పరుగులకే కుప్పకూలి ఓటమిని మూటగట్టుకున్నారు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంతో వ్యూహాలు, ఆటగాళ్ల సమష్టి కృషి బంగ్లాదేశ్‌ను విజయతీరాలకు చేర్చాయి.

పాక్ క్రికెట్ పతనం?

వరుస పరాజయాలతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు తీవ్ర విమర్శల పాలవుతోంది. సొంత గడ్డపైనే కాకుండా, ఉపఖండంలోని ఇతర జట్లపై కూడా ప్రభావం చూపలేకపోవడం ఆ జట్టు వైఫల్యానికి అద్దం పడుతోంది. మరోవైపు, బంగ్లాదేశ్ టెస్టుల్లో పరిణతి చెందిన జట్టుగా ఎదుగుతూ అగ్రశ్రేణి జట్లకు సవాల్ విసురుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us