ఏపీలో మద్యం అమ్మకాలపై హైకోర్టులో పిటిషన్..

|

May 11, 2020 | 2:53 PM

ఏపీలో కరోనా నేపధ్యంలో మద్యం అమ్మకాలను జరపడంపై మాతృభూమి ఫౌండేషన్ హై కోర్టులో పిటీషన్ వేసింది. ఇక ఈ పిటిషన్‌ను న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. కోవిడ్ 19 నేపధ్యంలో మద్యం అమ్ముతూ క్యూలలో భౌతిక దూరం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, మద్యం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది అని పిటీషనర్ తరుపు న్యాయవాది వాదించారు. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్‌లో టెన్షన్..) సంపూర్ణ […]

ఏపీలో మద్యం అమ్మకాలపై హైకోర్టులో పిటిషన్..
Follow us on

ఏపీలో కరోనా నేపధ్యంలో మద్యం అమ్మకాలను జరపడంపై మాతృభూమి ఫౌండేషన్ హై కోర్టులో పిటీషన్ వేసింది. ఇక ఈ పిటిషన్‌ను న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. కోవిడ్ 19 నేపధ్యంలో మద్యం అమ్ముతూ క్యూలలో భౌతిక దూరం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, మద్యం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది అని పిటీషనర్ తరుపు న్యాయవాది వాదించారు. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్‌లో టెన్షన్..)

సంపూర్ణ మద్యనిషేదం ప్రభుత్వ పాలసీ అయినప్పుడు ….. మద్య నిషేధానికి అవకాశం వచ్చినపుడు ప్రభుత్వం అమలు చేయవచ్చు కదా అని పిటిషనర్ న్యాయవాది వాదించగా.. మద్యనిషేదాన్ని వెంటనే అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పలేదని, వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో సంపూర్ణ మద్యనిషేధం అమలు అవుతుందని ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అంతేకాకుండా మద్య నిషేధం పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత వ్యవధి కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. కాగా, బుధవారం నాటికి కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మద్యనిషేదం పిటీషన్ ను వెంటనే వినాల్సిన అవసరం ఉండగా శుక్రవారం తదుపరి విచారణ జరుపుతామని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. (డేంజర్ బెల్స్: మరో రెండు వారాల లాక్‌డౌన్‌కు సిద్దంకండి..)

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

హిందూ మతంలోకి మారిన 250 మంది ముస్లింలు.!