బ్రేకింగ్: బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్!

Badminton Star Player: ప్రముఖ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. హర్యానాలో పుట్టి పెరిగిన సైనా నెహ్వాల్.. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్నా, అర్జున్ అవార్డుల గ్రహీత అయిన సైనా.. ఒలింపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్‌లో అనేక మెడల్స్‌ను అందుకుంది. ప్రస్తుతం తొమ్మిదవ ర్యాంక్‌లో కొనసాగుతున్న ఈమెకు సోషల్ […]

బ్రేకింగ్: బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్!

Updated on: Jan 29, 2020 | 1:08 PM

Badminton Star Player: ప్రముఖ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. హర్యానాలో పుట్టి పెరిగిన సైనా నెహ్వాల్.. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది.

రాజీవ్ గాంధీ ఖేల్ రత్నా, అర్జున్ అవార్డుల గ్రహీత అయిన సైనా.. ఒలింపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్‌లో అనేక మెడల్స్‌ను అందుకుంది. ప్రస్తుతం తొమ్మిదవ ర్యాంక్‌లో కొనసాగుతున్న ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బీజేపీలో ఈమె చేరిక పార్టీకి కొత్త జోష్‌ను తీసుకొస్తుందని చెప్పాలి.

సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. ‘బీజేపీలో చేరడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. దేశానికి ఏమైనా సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరాను. మోదీ నేతృత్వంలో పని చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. క్రీడా అభివృద్ధికి మోదీ ఎంతగానో కృషి చేశారని ఆమె అన్నారు.