బిగ్‍బాస్‍లో వరుసగా లేేడీ కంటెస్టెంట్లు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఫ్రాంక్ అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ దేవి నాగవల్లిని ముందుగానే సాగనంపారు. ఇప్పుడు అప్పుడప్పుడైనా తిరగబడే జోర్దార్ సుజాతను పంపించేశారు. ఇక హౌస్‌లో శివంగిలా పోరాడేవాళ్లు కనిపించడం లేదు. బిగ్ బాస్ మొదటి సీజన్లో హరితేజ, మూడవ సీజన్లో శ్రీముఖి తమ స్కిల్స్‌తో పాటుగా టాస్కులలోనూ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చారు. కానీ ఈసారి ఆ స్థాయి లేడీ కంటెస్టెంట్స్ కనిపించడం లేదు. బిగ్ బాస్ నిర్వాహకులు సెలక్షన్స్ అప్పుడే ఈ విషయంపై కాస్త ఫోకస్ పెడితే బాగుండేది. ఇప్పటికే వరుసగా నాలుగు వారాలలో ఐదుగురు లేడీస్( కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, స్వాతి ధీక్షిత్, గంగవ్వ, సుజాత) బయటకు వచ్చేశారు.
ఇక హారిక, మోనల్ గజ్జర్ ఒంటిరిగా పోరాడటం లేదు. అరియానాకు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉంది కానీ టాస్కులు, అవి గెలవడానికి ఉపయోగపడే జిమ్మిక్కులు, లాజిక్కులపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. లాస్య వంటింటికే పరిమితమైపోయింది. దివి మాస్టర్ సాయం కోరుకుంటుంది. దీంతో నెక్ట్స్ సీజన్‌కి అయినా ఏ విషయంలోనూ వెనక్కి తగ్గని శివంగులను సెలక్ట్ చేస్తే మంచింది. ( పిల్లి పిల్ల అనుకుని కొన్నారు..తీరా రెండేళ్ల తర్వాత..! )