Allu Arjun: బాలీవుడ్‌ భామతో జతకట్టనున్న అల్లువారి అబ్బాయి…? బన్నీకి జోడిగా దబాంగ్‌ బ్యూటీని దింపుతోన్న కొరటాల..

B.Town Heroine With Allu Arjun: స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ గతేడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కంటే ముందు తెలుగులో విజయవంతమైన చిత్రం ఇదే కావడం విశేషం...

Allu Arjun: బాలీవుడ్‌ భామతో జతకట్టనున్న అల్లువారి అబ్బాయి...? బన్నీకి జోడిగా దబాంగ్‌ బ్యూటీని దింపుతోన్న కొరటాల..

Updated on: Jan 16, 2021 | 12:06 AM

B.Town Heroine With Allu Arjun: స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ గతేడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కంటే ముందు తెలుగులో విజయవంతమైన చిత్రం ఇదే కావడం విశేషం. ఇక ప్రస్తుతం వరుస సినిమాలకు ఓకే చెబుతూ ఫ్యాన్స్‌లో ఫుల్‌ జోష్‌ నింపుతున్నాడీ యంగ్‌ హీరో.
ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ఫా’ సినిమా షూటింగ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న బన్నీ.. తన తర్వాతి చిత్రాన్ని కొరటాల శివతో ప్లాన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. బన్నీ నటిస్తోన్న ‘పుష్పా’.. కొరటాల దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ చిత్రాలు షూటింగ్‌ పూర్తి చేసుకోగానే ఈ కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తస్తోంది. ఈ వార్త ప్రకారం బన్నీ, కొరటాల కాంబినేషనల్‌ రానున్న సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దబాంగ్‌3 చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సయూ మంజ్రేకర్‌ ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అడవి శేష్‌ హీరోగా నటిస్తోన్న ‘మేజర్‌’ చిత్రంలో నటిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Also Read: Actress Kriti Sanon : మహేష్ హీరోయిన్ కవితకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్‌‌‌‌గా మారిన కృతిసనన్ పోస్ట్