లాభాలతో ముగిసిన వీకెండ్

|

Oct 23, 2020 | 4:59 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు లాభాల్లో పయనించాయి. దేశీయ మార్కెట్లకు తోడు అమెరికాలో మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తారన్న అంచాలు...

లాభాలతో ముగిసిన వీకెండ్
Follow us on

Bull Bear Tug of War : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు లాభాల్లో పయనించాయి. దేశీయ మార్కెట్లకు తోడు అమెరికాలో మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తారన్న అంచాలు పెరుగుతుండటంతో ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. ఈ ఎఫెక్ట్ తో మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి.

ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ చివరికి 127.01 పాయింట్ల లాభంతో 40,685.50 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 33.90 పాయింట్ల లాభంతో 11,930.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.60గా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీ, హెచ్ డీఎఫ్ సీ లైఫ్ వంటి ప్రధాన షేర్లలో కొంత జోష్ కనిపించడం మార్కెట్ల లాభాలకు కారణమయ్యాయి.

నిఫ్టీలో మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ షేర్లు రాణించాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, శ్రీ సిమెంట్స్‌, గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హిందుస్థాన్‌ యునిలీవర్స్‌ షేర్లు నష్టపోయాయి. ఫార్మా రంగ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు లాభాల బాటలో పయనించాయి.