వయసు పెరుగుతోంది, ఇకపై గ్రౌండ్‌లో క్రమశిక్షణతో వ్యవహరిస్తా: డేవిడ్ వార్నర్
ఇకపై గ్రౌండ్‌లో ప్రశాంతంగా ఉంటానని, క్రమశిక్షణతో మెలుగుతానని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. రిటైర్మెంట్కు రోజులు దగ్గరపడుతున్న కారణంగా....
ఇకపై గ్రౌండ్‌లో ప్రశాంతంగా ఉంటానని, క్రమశిక్షణతో మెలుగుతానని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. రిటైర్మెంట్కు రోజులు దగ్గరపడుతున్న కారణంగా తనలోని దూకుడు స్వభావాన్ని క్రమంగా మార్చుకుంటున్నట్లు చెప్పాడు. ఎవరైనా తనపై స్లెడ్జింగ్‌కి పాల్పడితే.. వారికి బ్యాట్‌తో మాత్రమే సమాధానం చెబుతానని పేర్కొన్నాడు. ఈ మధ్యే 34వ ఏట అడుగు పెట్టానని.. ఇకపై మైదానంలో గతంలోలా మాటల యుద్ధానికి దిగకుండా, మౌనంగా వెళ్లాలనుకుంటున్నట్లు వివరించాడు.
భారత్‌తో జరగబోయే వన్డే సిరీస్ గురించి కూడా వార్నర్ మాట్లాడాడు. వన్డేల్లో మంచి ఓపెనింగ్ చేయడం సహా మధ్య ఓవర్లలో దూకుడుగా ఆడటం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తాను మంచి స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నానని… వయసు పెరుగుతున్న క్రమశిక్షణ నేర్చుకోవడం వల్ల ఆటలో అత్యున్నత స్థాయికి చేరుతామని వెల్లడించాడు. వన్డే, టీ20ల్లో భారత వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంపై డేవిడ్ వార్నర్ స్పందించాడు. జట్టులో సీనియర్ ప్లేయర్ రోహిత్ లేకపోయినా.. మంచి ఫామ్‌లో ఉన్న క్రికెటర్లు చాలామంది ఉన్నారని అభిప్రాయపడ్డాడు. శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు ఐపీఎల్లో అద్భుతంగా ఆడారని గుర్తు చేశాడు. టెస్టు వైస్‌కెప్టెన్ అంజిక్య రహానె ప్రశాంతంగా ఆడుతూ.. పని పూర్తి చేస్తాడని వెల్లడించాడు.
Also Read :
తీవ్ర విషాదం, కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్ ధుపేలియా మృతి
గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట తీవ్ర విషాదం, మేనల్లుడు ఆత్మహత్య
ఆ ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు అక్కడే ఉండాలి, జగన్ సర్కార్ కీలక ఆదేశాలు
గ్రేటర్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్, బీజేపీలోకి విజయశాంతి, రేపే ముహూర్తం