బెంగళూరు రోడ్లపై మూన్ వాక్.. రీజన్ తెలిస్తే మైండ్ బ్లాక్!

బెంగళూరు రోడ్లపై మూన్ వాక్.. రీజన్ తెలిస్తే మైండ్ బ్లాక్!

గుంతలమయమైన రోడ్లతో జనాలు ఎలాంటి అవస్థలు పడతారో అందరికి తెలిసిన విషయమే. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం ఉండదు. మనలో మనమే సర్దుకుపోయే స్టేజి‌కి వచ్చేసి లోలోపల తిట్టుకుంటూనే ఆ గతుకుల రోడ్లపైనే కుదుపుల ప్రయాణం చేయడం అలవాటు చేసుకున్నాం. ఇది ఇలా ఉండగా బెంగళూరులోని రహదారుల అధ్వాన్న పరిస్థితిని వినూత్న పద్దతిలో ఓ వ్యక్తి ప్రపంచానికి పరిచయం చేశాడు. వ్యోమగామి దుస్తులతో అక్కడ గుంతల రోడ్డుపై నడుస్తూ అక్కడ ఉన్న దారుణమైన పరిస్థితిని తెలియజెప్పడానికి […]

Ravi Kiran

|

Sep 03, 2019 | 1:38 AM

గుంతలమయమైన రోడ్లతో జనాలు ఎలాంటి అవస్థలు పడతారో అందరికి తెలిసిన విషయమే. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం ఉండదు. మనలో మనమే సర్దుకుపోయే స్టేజి‌కి వచ్చేసి లోలోపల తిట్టుకుంటూనే ఆ గతుకుల రోడ్లపైనే కుదుపుల ప్రయాణం చేయడం అలవాటు చేసుకున్నాం. ఇది ఇలా ఉండగా బెంగళూరులోని రహదారుల అధ్వాన్న పరిస్థితిని వినూత్న పద్దతిలో ఓ వ్యక్తి ప్రపంచానికి పరిచయం చేశాడు. వ్యోమగామి దుస్తులతో అక్కడ గుంతల రోడ్డుపై నడుస్తూ అక్కడ ఉన్న దారుణమైన పరిస్థితిని తెలియజెప్పడానికి ప్రయత్నించాడు.

అంతరిక్షంలో మూన్‌పై వ్యోమగామి వాక్ చేస్తున్న మాదిరిగానే నటిస్తూ ఓ అద్భుతమైన వీడియోను చిత్రీకరించారు. ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ అతడు వెళ్తున్న ఆ వీడియోను మొదట మనం చూస్తే నిజంగానే అంతరిక్షంలో ఉన్నాడేమో అన్న భావన కల్గుతుంది. కొద్దిసేపు ఆ వీడియోను ఫార్వర్డ్ చేసిన తర్వాత గానీ అది ఓ రహదారి అని తెలియదు. బెంగళూరులోని రహదారుల అధ్వాన్నమైన పరిస్థితిని చాటిచెప్పే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు నాసా, ఇస్రో, స్పేస్‌ ఎక్స్‌లను కూడా ట్యాగ్ చేశాడు.

బెంగళూరులోని రోడ్లపై అనేక చోట్ల ఇలాంటి గుంతలు పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితి ఒక్క బెంగళూరు నగరంలో మాత్రమే లేదు ముంబై వంటి మెట్రోపాలిటన్‌ నగరాల్లో కూడా ఉంది. సదరు వ్యక్తి పోస్ట్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ కావడంతో సిటీలలో ఉన్న చాలామంది ప్రజలు అక్కడి రహదారుల భయంకరమైన పరిస్థితిని తెలియజెప్పే ఫోటోలను షేర్ చేస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu