ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి.. ఎల్బీనగర్‌లోని తన ఇంట్లోనే దీక్షకు దిగారు. జేఏసీ ప్లాన్ ప్రకారం.. ఇవాళ నేతల నిరాహార దీక్ష ఉంది. కానీ.. దాన్ని భగ్నం చేసేలా ముందస్తు అరెస్టులకు.. రాత్రి నుంచే ప్రయత్నిస్తూ వస్తున్నారు పోలీసులు. అర్థరాత్రే అశ్వత్థామ ఇంటి దగ్గర మోహరించిన పోలీసులు.. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో.. ఆర్టీసీ కార్మికులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో.. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అశ్వత్థామ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో.. ఇంట్లోనే దీక్షకు దిగారాయన.
కాగా.. ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జేఏసీ ప్రణాళిక ప్రకారం ఇవాళ నిరాహార దీక్ష ఉంది. దాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు రాత్రి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతల ఇళ్లు, జేఏసీ నేతల కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ముందుగా నేతలను అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు.
ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన బస్ రోకోను భగ్నం చేసేందుకు డిపోలు, బస్టాండ్‌ల దగ్గర కూడా పోలీసులు పరారా కాస్తున్నారు. బస్ భవన్‌తో పాటు ప్రతీ డిపో దగ్గర 500 మీటర్ల వరకూ 144 సెక్షన్‌ను అమలు చేశారు. గ్రూపులుగా ఏర్పడటం, ఆందోళనలకు దిగడం లాంటివి చేస్తే.. అరెస్టులు తప్పవని ఇప్పటికే హెచ్చరించారు పోలీసులు.