కరోనా నేపథ్యంలో.. నిరాడంబరంగా ఆషాఢ బోనాలు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. బోనాలు అమ్మవారుని పూజించే హిందువుల పండుగ. ఈ క్రమంలో కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ తెలంగాణ

కరోనా నేపథ్యంలో.. నిరాడంబరంగా ఆషాఢ బోనాలు..

Updated on: Jun 26, 2020 | 7:33 AM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. బోనాలు అమ్మవారుని పూజించే హిందువుల పండుగ. ఈ క్రమంలో కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ బోనాలు చారిత్రాత్మక గోల్కొండ కోటలో గురువారం నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయశాఖ, పోలీస్‌, పురావస్తు శాఖల అధికారుల సమన్వయంతో వేడుక అట్టహాసంగా జరిగింది. గోల్కొండ కోటపై జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు, తొట్టెలు, నజర్‌ బోనం సమర్పించి ఒడిబియ్యం పోయడంతో తొలిపూజ ముగిసింది.

రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు గురువారం లంగర్‌హౌస్‌లో నాలుగు అడుగుల తొట్టెల ఊరేగింపుతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.30 గంటలకు గోల్కొండ ఛోటాబజార్‌లోని ఆలయ పూజారి ఇంట్లో పూజలు చేసి అమ్మవారి విగ్రహాలు, తొట్టెలను ఊరేగింపుగా కోటపైకి తీసుకెళ్లగా… మహిళలు సాక పోసి మొక్కులు తీర్చుకున్నారు.

చాంద్రాయణగుట్ట పరిధిలోని ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ మహిళా భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించారు. ఉప్పుగూడ అమ్మవారి ఆలయం నుంచి గోల్కొండలోని జగదాంబ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us