చిక్కుల్లో మళయాళ నటి.. సినిమా ప్రచారమే కొంపముంచిందా..?

| Edited By:

Jul 06, 2019 | 9:41 AM

ప్రముఖ మలయాళ నటి ఆశా శరత్‌కు చేదు అనుభవం ఎదురైంది. సినిమా ప్రచారం చేయబోయి ఇబ్బందులు కొనితెచ్చుకుంది. తాజాగా మలయాళంలో ఆమె నటించిన చిత్రం ఎవిడే. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆశా తన ఫేస్‌బుక్ లో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో తన భర్త కనిపించడం లేదు. ఎవరైనా ఆయన్ని ఎక్కడైనా చూసుంటే కేరళలోని కట్టప్పన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి అని పేర్కొన్నారు. ముఖానికి మేకప్ లేకుండా బాధపడుతున్నట్లుగా ఆమె వీడియోను పోస్టు చేయడంతో […]

చిక్కుల్లో మళయాళ నటి.. సినిమా ప్రచారమే కొంపముంచిందా..?
Follow us on

ప్రముఖ మలయాళ నటి ఆశా శరత్‌కు చేదు అనుభవం ఎదురైంది. సినిమా ప్రచారం చేయబోయి ఇబ్బందులు కొనితెచ్చుకుంది. తాజాగా మలయాళంలో ఆమె నటించిన చిత్రం ఎవిడే. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆశా తన ఫేస్‌బుక్ లో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో తన భర్త కనిపించడం లేదు. ఎవరైనా ఆయన్ని ఎక్కడైనా చూసుంటే కేరళలోని కట్టప్పన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి అని పేర్కొన్నారు. ముఖానికి మేకప్ లేకుండా బాధపడుతున్నట్లుగా ఆమె వీడియోను పోస్టు చేయడంతో చాలామంది నిజమేనని నమ్మేశారు. దీనిని చూసిన ఓ లాయర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. విషయం సీరియస్ అవడంతో అది సినిమా కోసం చేసిన ప్రచార వీడియో అని వెల్లడిస్తే ఆశా విషయాన్ని బయటపెట్టారు. దీంతో ఆమె తీరుపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గతంలో ఇలాంటి ఘటన నటి శోభనకు కూడా ఎదురైంది.