కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లోని ముస్లిం నేతలు ఎంత కాలం పార్టీ నాయకత్వానికి బానిసగా ఉంటారో వారే ఆలోచించుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోని ముస్లిం నేతలంతా తమ సమయాన్ని వృధా చేస్తున్నారని ఆయన అన్నారు. గులాం నబీ ఆజాద్ మమ్మల్ని బీజేపీ టీం అని పిలిచేవారని, ఇప్పుడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడే ఆయనను బీజేపీతో కుమ్మక్కయ్యారా అని అనుమానిస్తున్నారని ఒవైసీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం నేతలు ఈ అవమానం భరించాలా అని ఆయన వ్యాఖ్యానించారు.