ఆయన అలాంటివారు కారు: గొగోయ్‌కి జైట్లీ క్లీన్‌చిట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు నిరాధారమైనవని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. న్యాయ వ్యవస్థను అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. ఈ వ్యవస్థకు బాసటగా నిలవాల్సిన సమయమిదని ఆయన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. సీజేఐపై అసత్య ఆరోపణలు చేసిన వారికి ధీటైన జవాబివ్వాలని జైట్లీ కోరారు. వ్యక్తిగత మర్యాద, నైతిక విలువలను పాటించడంలో జస్టిస్ గొగోయ్‌ ముందు వరుసలో ఉంటారని జైట్లీ పేర్కొన్నారు. సీజేఐ అభిప్రాయాలతో పలువురు న్యాయ వివర్శకులు విభేదించినప్పటికీ.. ఆయన విలువలను […]

ఆయన అలాంటివారు కారు: గొగోయ్‌కి జైట్లీ క్లీన్‌చిట్

Edited By:

Updated on: Apr 22, 2019 | 12:50 PM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు నిరాధారమైనవని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. న్యాయ వ్యవస్థను అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. ఈ వ్యవస్థకు బాసటగా నిలవాల్సిన సమయమిదని ఆయన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. సీజేఐపై అసత్య ఆరోపణలు చేసిన వారికి ధీటైన జవాబివ్వాలని జైట్లీ కోరారు.

వ్యక్తిగత మర్యాద, నైతిక విలువలను పాటించడంలో జస్టిస్ గొగోయ్‌ ముందు వరుసలో ఉంటారని జైట్లీ పేర్కొన్నారు. సీజేఐ అభిప్రాయాలతో పలువురు న్యాయ వివర్శకులు విభేదించినప్పటికీ.. ఆయన విలువలను ఎప్పుడూ ప్రశ్నించలేదని స్పష్టం చేశారు. అయితే గొగోయ్‌ తనను లైంగికంగా వేధించారని సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఈ నెల 24న తదుపరి విచారణ జరగనుంది.