సెర్గీ బుబ్కా రికార్డును బద్దలు కొట్టిన డుప్లాంటిస్‌

|

Sep 19, 2020 | 4:05 PM

పోల్‌వాల్ట్‌ అనగానే చటుక్కున సెర్గీ బుబ్కానే గుర్తుకొస్తాడు.. పోల్‌వాల్ట్‌లో అతడు సాధించిన రికార్డులు అలాంటివి మరి! ఉక్రెయిన్‌కు చెందిన బుబ్కా సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం వరకు యూఎస్‌ఎస్‌ఆర్‌కే ప్రాతినిధ్యం..

సెర్గీ బుబ్కా రికార్డును బద్దలు కొట్టిన డుప్లాంటిస్‌
Follow us on

పోల్‌వాల్ట్‌ అనగానే చటుక్కున సెర్గీ బుబ్కానే గుర్తుకొస్తాడు.. పోల్‌వాల్ట్‌లో అతడు సాధించిన రికార్డులు అలాంటివి మరి! ఉక్రెయిన్‌కు చెందిన బుబ్కా సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం వరకు యూఎస్‌ఎస్‌ఆర్‌కే ప్రాతినిధ్యం వహించాడు.. 1991 నుంచి ఉక్రేయిన్‌ తరఫున ఆడుతున్నాడు. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో, ఒలింపిక్స్‌లో బుబ్కా పతకాలే కాదు రికార్డులు సాధించాడు.. తన రికార్డను తానే అనేకమార్లు అధిగమించాడు.. అతడు నెలకొల్పిన రికార్డులు కొన్ని ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నాయి.. 26 ఏళ్లుగా అలా చెరిగిపోకుండా ఉన్న ఓ రికార్డును స్వీడన్‌ అథ్లెట్‌ ఆర్మండ్‌ డుప్లాంటిస్‌ చెరిపివేశాడు. రోమ్‌లో జరుగుతున్న గోల్డెన్‌ గాలా అథ్లెటిక్‌ మీట్‌లో పురుషుల పోల్‌వాల్ట్‌ అవుట్‌డోర్‌ పోటీలలో రెండో ప్రయత్నంలో ఆరు మీటర్ల 15 సెంటిమీటర్ల ఎత్తుకు ఎగిరిన డుప్లాంటిస్‌ 1994లో బుబ్కా నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు.. అప్పుడు బుబ్కా రికార్డు ఆరు మీటర్ల 14 సెంటిమీటర్లు. మొన్న ఫిబ్రవరిలో గ్లాస్గోలో జరిగిన అథ్లెటిక్స్‌ మీట్‌లో డుప్లాంటిస్‌ ఇండోర్‌ రికార్డు కూడా సాధించాడు. ఇందులో 6.18 మీటర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అవుట్‌డోర్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఇన్నాళ్లకు తన కోరిక తీరిందని డుప్లాంటిస్‌ అన్నాడు. డుప్లాంటిస్‌ పుట్టింది స్వీడన్‌లోనే అయినా పెరిగింది మాత్రం అమెరికాలో. మళ్లీ పుట్టిపెరిగిన స్వీడన్‌కే తిరిగొచ్చి ఆ దేశానికి ఖ్యాతిని తెస్తున్నాడు డుప్లాంటిస్‌..