నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీలో 63 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ..!

|

Feb 01, 2020 | 1:32 PM

APPSC Calendar 2020: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించనుంది. పలు ప్రభుత్వ శాఖల్లో సుమారు 63 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీటిపై లోతైన అధ్యయనం జరుగుతుండగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ క్యాలెండర్ విడుదలపై నిన్న క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టే పథకాలన్నీ విజయవంతం కావాలంటే వైద్య, విద్య శాఖల్లో ఉద్యోగాల భర్తీకి […]

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీలో 63 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ..!
Follow us on

APPSC Calendar 2020: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించనుంది. పలు ప్రభుత్వ శాఖల్లో సుమారు 63 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీటిపై లోతైన అధ్యయనం జరుగుతుండగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ క్యాలెండర్ విడుదలపై నిన్న క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వం చేపట్టే పథకాలన్నీ విజయవంతం కావాలంటే వైద్య, విద్య శాఖల్లో ఉద్యోగాల భర్తీకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని భర్తీ జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

ఇక ఏపీపీఎస్సీ ద్వారా 19 వేలు.. అలాగే డీఎస్సీ ద్వారా 21 వేల పోస్టులను, పోలీస్ శాఖలో 13 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. త్వరలోనే వీటిని భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటన మార్చిలో జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.