AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏపీ పాఠశాలలకు 87 సెలవులు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే!

AP School Holidays: వచ్చే విద్యా సంవత్సరానికి (2026-27) సంబంధించి పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. సెలవులతో పాటు విద్యార్థులను పైతరగతులకు సిద్ధం చేసేందుకు జూన్ 12 నుంచి ప్రత్యేక బోధన ఉంటుంది. 1, 2, 6 తరగతులకు 36 రోజులు..

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏపీ పాఠశాలలకు 87 సెలవులు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే!
Ap School Academic Calendar
Subhash Goud
|

Updated on: May 02, 2026 | 11:21 AM

Share

AP School Holidays: వచ్చే విద్యా సంవత్సరానికి (2026-27) సంబంధించి పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. ఉపాధ్యాయ సంఘాల సూచనల మేరకు రూపొందించిన ఈ షెడ్యూల్‌లో సెలవులు, పరీక్షల తేదీలు, బోధనా పద్ధతులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  • మొత్తం పనిదినాలు: 229 రోజులు.
  • మొత్తం సెలవులు: 87 రోజులు.
  • అదనపు సెలవులు: 5 ఐచ్ఛిక సెలవులు (Optional Holidays), 3 స్థానిక సెలవులు (Local Holidays).

ఇది కూడా చదవండి: Monsoon: ముందస్తుగానే పలకరించనున్న రుతుపవనాలు.. ఈనెల 14 నుంచే అండమాన్‌కు ఎంట్రీ!

ఇవి కూడా చదవండి
పండుగ  సాధారణ పాఠశాలలు మైనారిటీ పాఠశాలలు
దసరా సెలవులు అక్టోబరు 12 – 21 అక్టోబరు 15 నుండి
క్రిస్మస్ సెలవులు డిసెంబరు 25 (ఒక్క రోజే) డిసెంబరు 20 – 27
సంక్రాంతి సెలవులు 2027 జనవరి 11 – 17 2027 జనవరి 13 – 17

పరీక్షల షెడ్యూల్ (2026-27):

విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు నిర్వహించే పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి:

ఫార్మెటివ్-1: ఆగస్టు 3 – 6

ఫార్మెటివ్-2: అక్టోబరు 5 – 8

సమ్మెటివ్-1: నవంబరు 9 – 20

ఫార్మెటివ్-3: జనవరి 4 – 7 (2027)

ఫార్మెటివ్-4: ఫిబ్రవరి 8 – 11

10వ తరగతి ప్రీ-ఫైనల్: ఫిబ్రవరి 8 – 18

10వ తరగతి పబ్లిక్ పరీక్షలు: 2027 మార్చి 15 – 31

1 నుండి 8 తరగతుల సమ్మెటివ్-2: 2027 ఏప్రిల్ 3 – 17

ముఖ్యమైన అంశాలు:

నో బ్యాగ్ డే: ప్రతి శనివారం విద్యార్థులు పుస్తకాల బ్యాగ్ లేకుండా పాఠశాలకు రావచ్చు. ఆ రోజున విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచే కృత్యాలు నిర్వహిస్తారు.

తరగతి సంసిద్ధత: విద్యార్థులను పైతరగతులకు సిద్ధం చేసేందుకు జూన్ 12 నుంచి ప్రత్యేక బోధన ఉంటుంది. 1, 2, 6 తరగతులకు 36 రోజులు, మిగతా తరగతులకు 13 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది.

ఉపాధ్యాయుల పనిభారం: ప్రతి టీచర్‌కు వారానికి కనిష్ఠంగా 24, గరిష్ఠంగా 30 పీరియడ్లు ఉంటాయి. అవసరమైతే ఫిజిక్స్ టీచర్లు గణితం కూడా బోధించాల్సి ఉంటుంది.

ప్రవేశాల డ్రైవ్: జూన్‌లో పాఠశాలలు ప్రారంభం కాగానే కొత్త విద్యార్థుల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు.

విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ క్యాలెండర్ ప్రకారం తమ సెలవులను, పరీక్షల ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. జూన్ 12 నుండి విద్యా సంవత్సరం అధికారికంగా ప్రారంభం కానుంది.

ఇది కూడా చదవండి: Gas Cylinder: గ్యాస్ సిలిండర్‌ బుకింగ్‌లో కొత్త రూల్స్‌.. ఇక నుంచి అలా చేస్తే కుదరదు.. మరింత కఠినతరం!

ఇది కూడా చదవండి: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us