Vizag Municipal Elections 2021: విశాఖలో ప్రశాంతంగా పోలింగ్‌ ప్రారంభం.. ఉక్కు కార్మికుల నిరసనల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు

| Edited By: Ravi Kiran

Mar 10, 2021 | 10:45 AM

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు..

Vizag Municipal Elections 2021: విశాఖలో ప్రశాంతంగా పోలింగ్‌ ప్రారంభం.. ఉక్కు కార్మికుల నిరసనల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు
Follow us on

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఇక గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 98 వార్డులకు 98 మంది జోనల్‌ మెజిస్ట్రేట్‌లను నియమించినట్లు కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. 2007లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 52.48శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైందని కలెక్టర్‌ తెలిపారు. ఈసారి ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.

అన్ని కాలనీలకు, మురికివాడలకు అత్యంత సమీపంలోనే పోలింగ్‌కేంద్రాల్ని ఏర్పాటుచేశామని. ఎవరికీ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లున్నాయని వెల్లడించారు. బుధవారం సెలవుదినంగా ప్రకటించారని, ఆ అవకాశం లేని వారు ఓటు వేసేందుకు కనీసం 3, 4 గంటల పాటు తమ సిబ్బందికి సమయం ఇవ్వాలని సంస్థలకు, కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. వార్డుల్లో ఎక్కడ అతిక్రమణలు జరిగినా, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినా.. వారిపై చర్యలు తీసుకునేందుకు జోనల్‌ మెజిస్ట్రేట్‌లకు పూర్తిస్థాయి అధికారాలిచ్చామని హెచ్చరించారు.. వీరి పరిధిలో మరో 205మంది రూట్‌ అధికారుల్ని నియమించామని చెప్పారు.

జీవీఎంసీ 98వార్డుల్లో 566 మంది, ఎలమంచిలిలో 22వార్డులకు 62మంది, నర్సీపట్నంలో 28వార్డులకు 78మంది పోటీలో ఉన్నారు. మార్చి 9, 2020కి సిద్ధంగా ఉన్న ఓటర్ల జాబితానే పరిగణలోకి తీసుకుంటున్నామని కలెక్టర్‌ వివరించారు. జీవీఎంసీ నర్సీపట్నం, ఎలమంచిలితో కలిసి మొత్తం 18,05,311మంది ఓటర్లున్నారు. పోలింగ్‌ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే పోలింగ్‌ స్లిప్పులు గుర్తింపుకార్డులు మాత్రం కావని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌ సూచించిన 20 కార్డుల్లో ఏదోఒకటి గుర్తింపుగా చూపించాలని సూచించారు.

పురపాలక ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ కేంద్రాల్లో వీడియోగ్రాఫ్‌, వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌కేంద్రాలకు ఇంటర్నెట్‌ సమస్య లేదని కలెక్టర్‌ తెలిపారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్‌కేంద్రాల పర్యవేక్షణకు 570 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. కోడ్‌ పర్యవేక్షణ కోసం రెట్టింపు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పోలింగ్‌ పూర్తయ్యాక ఏయూలో బ్యాలెట్‌ బాక్సుల్ని భద్రపరించేందుకు ఏర్పాట్లు చేశారు. నగరంలో 190 మొబైల్‌టీంలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక ఆర్మ్‌డ్‌ గార్డ్‌, మహిళా పోలీసును నియమించారు.

Read More:

Municipal Elections 2021: విజయవాడలో ప్రారంభమైన పోలింగ్‌.. ఓటు హక్కు వినియోగించుకుంటున్న 7.83 లక్షల మంది ఓటర్లు