ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటాం…

|

Oct 02, 2020 | 3:07 PM

కరోనాతో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య హామీ ఇచ్చారు. విజయవాడలో కరోనాతో మరణించిన ఆర్టీసీ ఉద్యోగులు శుభాకరరావు, ఎస్కే లాల్‌ కుటుంబాలను రాష్ట్ర మంత్రులు...

ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటాం...
Follow us on

కరోనాతో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య హామీ ఇచ్చారు. విజయవాడలో కరోనాతో మరణించిన ఆర్టీసీ ఉద్యోగులు శుభాకరరావు, ఎస్కే లాల్‌ కుటుంబాలను రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, రవాణా, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు పరామర్శించారు. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చెక్కును అందించారు.

రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఆర్టీసీ కార్మికులు విశేష సేవలందించారని అన్నారు. ఆర్టీసీలో 4,700 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. 73 మంది మరణించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్టీసీ నుంచి వచ్చే బకాయిలు, ఇతరత్రా కాకుండా సంస్థ ఉద్యోగులు ఒక రోజు వేతనం ఇస్తున్నారు. ఆ 73 మంది కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున అందిస్తామని మంత్రి అన్నారు.