27న ఫైనల్ డెసిషన్.. ఏపీ రాజధానిపై బొత్స వ్యాఖ్య!

| Edited By:

Dec 23, 2019 | 7:09 PM

ప్రస్తుతం ఏపీలో రాజధానిపై పెద్ద రగడే జరుగుతోంది. ముఖ్యంగా అమరావతిలో.. రైతుల ఆందోళలను మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో.. మంత్రి బొత్స సత్యనారాయణ రైతుల ఆందోళనపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 27న తుది నిర్ణయం వస్తుందని తెలిపారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఉండాలని సిఫార్సు చేశారు. […]

27న ఫైనల్ డెసిషన్.. ఏపీ రాజధానిపై బొత్స వ్యాఖ్య!
Follow us on

ప్రస్తుతం ఏపీలో రాజధానిపై పెద్ద రగడే జరుగుతోంది. ముఖ్యంగా అమరావతిలో.. రైతుల ఆందోళలను మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో.. మంత్రి బొత్స సత్యనారాయణ రైతుల ఆందోళనపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 27న తుది నిర్ణయం వస్తుందని తెలిపారు.

శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఉండాలని సిఫార్సు చేశారు. ఎడ్యుకేషన్ హబ్‌గా అమరావతిని చేయాలని వారు పేర్కొన్నారు. అలానే మేము ముందుకు వెళ్తున్నామన్నారు. కాగా.. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు వల్ల ఏపీ అభివృద్ధి జరగదని చంద్రబాబునే స్వయంగా అంటున్నారు. ఆయన వ్యాఖ్యల తర్వాతైనా ఆందోళన చేస్తున్న రైతులు ఆలోచించుకోవాలన్నారు. నిజంగా అమరావతిని అభివృద్ధి చేయాలనుకుంటే.. చంద్రబాబు ఎందుకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. రైతుల పేరుతో చంద్రబాబు దోపిడీ చేశారు. ఇంకా ఆయన్ని నమ్మి మోసపోకండని బొత్స అన్నారు.

అలాగే.. అన్నీ అమరావతిలోనే ఉండాలని కొంతమంది రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా రైతులు ఆందోళన విరమించాలని.. మీకు ఎలాంటి నష్టం జరగదని ఆయన అన్నారు. మీకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉటుందని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని రైతులనుద్ధేశించి వ్యాఖ్యానించారు బొత్స.