వరద బాధితులకు అదనంగా మరో రూ.5 వేలు..

| Edited By:

Aug 08, 2019 | 5:42 PM

గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు చేసిన పాపాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయన్నారు తూ.గో.జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆళ్ల నాని. గోదావరి వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమీక్ష ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్ల కోసం చంద్రబాబు.. కనీసం నిర్వాసితులను తరలించకుండా హెడ్ వర్క్ పనులను చేపట్టారని విమర్శించారు. ఆనాడు బాబు చేసిన పాపాలను ఇప్పుడు ప్రజలు భరించాల్సి వస్తుందన్నారు. గోదావరి వరదలపై అధికారులతో […]

వరద బాధితులకు అదనంగా మరో రూ.5 వేలు..
Follow us on

గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు చేసిన పాపాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయన్నారు తూ.గో.జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆళ్ల నాని. గోదావరి వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమీక్ష ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్ల కోసం చంద్రబాబు.. కనీసం నిర్వాసితులను తరలించకుండా హెడ్ వర్క్ పనులను చేపట్టారని విమర్శించారు. ఆనాడు బాబు చేసిన పాపాలను ఇప్పుడు ప్రజలు భరించాల్సి వస్తుందన్నారు.

గోదావరి వరదలపై అధికారులతో సీఎం ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారని .. ప్రతి కుటుంబానికి అదనంగా రూ.5 వేలు సహాయాన్ని అందించాలని ఆదేశించినట్టుగా తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలు అధైర్య పడవద్దని అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నామని మంత్రి నాని తెలిపారు. మరోవైపు పంటనష్టం సంభవించిన ప్రాంతాల్లో రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో 4,824 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టుగా మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు పంట మునిగిన రైతులకు విత్తనాలు ఉచితంగా ఇవ్వనున్నట్టు మంత్రి నాని తెలిపారు.