జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్..’పేదలందరికీ ఇళ్లు’ ప‌థ‌కానికి నిధులు విడుదల

|

Jun 22, 2020 | 6:54 PM

ఏపీ సీఎం అతి ముఖ్య‌మైన‌దిగా భావిస్తోన్న‌ పేదలందరికీ ఇళ్లు పథకం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గరపడుతోంది. దివంగ‌త నేత వైఎస్సార్ జ‌యంతి సంద‌ర్భంగా జులై 8వ తేదీన పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా స్టార్ట్ చేయ‌బోతుంది.

జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్..పేదలందరికీ ఇళ్లు ప‌థ‌కానికి నిధులు విడుదల
Follow us on

ఏపీ సీఎం అతి ముఖ్య‌మైన‌దిగా భావిస్తోన్న‌ పేదలందరికీ ఇళ్లు పథకం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గరపడుతోంది. దివంగ‌త నేత వైఎస్సార్ జ‌యంతి సంద‌ర్భంగా జులై 8వ తేదీన పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా స్టార్ట్ చేయ‌బోతుంది. అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ఇవ్వ‌బోతుంది. ఇప్పటికే స్థానిక ఎన్నిక‌లు, క‌రోనావైర‌స్ వ‌ల్ల‌ రెండుసార్లు వాయిదా పడిన ఈ పథకాన్ని జూలై 8వ తేదీన ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించడానికి ఏపీ స‌ర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.

మొద‌టి విడ‌త‌లో ఎనిమిది జిల్లాల కోసం బడ్జెట్ మొత్తాన్ని గ‌వ‌ర్న‌మెంట్ రిలీజ్ చేసింది. మొత్తం 459.32 కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. మిగిలిన అయిదు జిల్లాలకు మరోసారి నిధులు విడుద‌ల చేస్తారు. విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, కడప జిల్లాలకు 50 కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్ కేటాయించారు.

నెల్లూరు, కర్నూలు జిల్లాలకు 80 కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్‌ను విడుద‌ల‌ చేశారు. అనంతపురం-60, విశాఖపట్నం-39.32 కోట్లు కేటాయించారు. మిగిలిన ఉభ‌య గోదావ‌రి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు మరో విడుద‌ల‌ బడ్జెట్‌ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.