మహిళా డిప్యూటీ సీఎంకు మరో కీలక పదవి..ఆదేశాలు జారీ!

|

Jul 25, 2019 | 12:17 AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణికి మరో కీలక పదవి దక్కింది.  ఏపీ ప్రభుత్వం గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి  చైర్‌పర్సన్‌గా పుష్ప శ్రీవాణి నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మండలిలో చైర్మన్‌తోపాటు మొత్తం ఐదుగురు ఉంటారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి‌‌తోపాటు మరో ఇద్దరు అధికారులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిషనర్ ఎక్స్‌అఫిషియో సెక్రటరీగా ఉంటారు. […]

మహిళా డిప్యూటీ సీఎంకు మరో కీలక పదవి..ఆదేశాలు జారీ!
Follow us on

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణికి మరో కీలక పదవి దక్కింది.  ఏపీ ప్రభుత్వం గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి  చైర్‌పర్సన్‌గా పుష్ప శ్రీవాణి నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మండలిలో చైర్మన్‌తోపాటు మొత్తం ఐదుగురు ఉంటారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి‌‌తోపాటు మరో ఇద్దరు అధికారులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిషనర్ ఎక్స్‌అఫిషియో సెక్రటరీగా ఉంటారు. మూడేళ్లపాటు ఈ మండలి కొనసాగుతుంది. గిరిజన ఎమ్మెల్యేలైన పాలకొండ ఎమ్మెల్యే కళావతి, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే భాగలక్ష్మీ, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజులు నాన్ అఫీషియల్ మెంబర్లుగా  వ్యవహరించనున్నారు .