సెక్స్‌ వర్కర్లకు రాష్ట్ర సర్కార్ కరోనా ఆఫర్

 సెక్స్‌ వర్కర్లకు ఏపీ సర్కార్  కరోనా ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వం పేదలుకు అందిస్తున్న ఉచిత రేషన్‌ను ఇక ముందు వీరికి కూడా‌ అందించాలని నిర్ణయించింది. కరోనా వ్యాప్తి‌ కారణంగా ఉపాధి కోల్పోయిన సెక్స్‌ వర్కర్లకు....

సెక్స్‌ వర్కర్లకు రాష్ట్ర సర్కార్ కరోనా ఆఫర్

Updated on: Nov 05, 2020 | 9:17 AM

Pandemic-Hit Sex Workers : సెక్స్‌ వర్కర్లకు ఏపీ సర్కార్  కరోనా ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వం పేదలుకు అందిస్తున్న ఉచిత రేషన్‌ను ఇక ముందు వీరికి కూడా‌ అందించాలని నిర్ణయించింది. కరోనా వ్యాప్తి‌ కారణంగా ఉపాధి కోల్పోయిన సెక్స్‌ వర్కర్లకు ఉచిత రేషన్‌ అందజేయాలని సుప్రీం కోర్టు గత నెలలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

అయితే నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్, లీగల్‌ ఆర్గనైజేషన్లు గుర్తించిన సెక్స్‌ వర్కర్లకు రేషన్‌ పంపిణీ చేయనుంది. లబ్ధిపొందిన వారి వివరాలను అత్యున్నత న్యాయస్థానంకు అందించనుంది. దీంతో ప్రభుత్వం ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ఇచ్చిన గుర్తింపు కార్డుల ఆధారంగా నవంబర్‌ నెల రేషన్‌ అందజేయనుంది. ‌

చౌకధరల దుకాణాలు, అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా రేషన్‌ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్రంలో 1.22 లక్షల మంది సెక్స్‌ వర్కర్లు ఉన్నట్టు ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ఇప్పటికే గుర్తించింది. వీరిలో హోమో సెక్సువల్స్‌తోపాటు ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఎంత రేషన్‌ ఇస్తోందో అంతే మొత్తంలో వీరికి కూడా పంపిణీ చేయనుంది.