జగన్ సర్కార్ సంచలనం.. 17 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!

కోవిడ్ బాధితులకు చికిత్స అందించడం కోసం డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది.

జగన్ సర్కార్ సంచలనం.. 17 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!

Updated on: Aug 05, 2020 | 8:49 AM

Replacement 17000 Health Department Posts AP: కరోనా వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు జగన్ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే కోవిడ్ బాధితులకు చికిత్స అందించడం కోసం డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్దం చేసింది. తాజాగా రాష్ట్రంలోని కోవిడ్ ఆసుపత్రులు, కేర్ సెంటర్లలోని వసతులపై ఆరా తీసిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 వేల పోస్టులను ఈ నెల 7వ తేదీలోగా భర్తీ చేస్తామని తెలిపారు. అటు రెగ్యులర్ వైద్య సిబ్బంది పోస్టులను 10వ తేదీలోపు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇక రాష్ట్రంలో వెంటిలేటర్లు,ఆక్సిజన్‌ బెడ్లు, మందులకు కొరత లేదన్న మంత్రి… కోవిడ్ ఆసుపత్రుల్లోనూ, కరోనా కేర్ సెంటర్లలోనూ రోగుల సంఖ్యకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..

Loading...
Unable to load recommendations.
Follow Us